Cycle Yatra: కడప జిల్లా నుంచి హైదరాబాద్‌కు సైకిల్ యాత్ర
Cycle Yatra: ప్రొద్దుటూరు నుంచి రామాంజనేయరెడ్డి సైకిల్ యాత్ర
Cycle Yatra: కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రామాంజనేయరెడ్డి అనే చిత్రకారుడు సైకిల్ యాత్ర చేపట్టాడు. ప్రొద్దుటూరు నుంచి హైదరాబాద్ వరకూ సైకిల్ యాత్ర చేస్తానని తెలిపాడు. భ్రూణ హత్యల నివారణపై అవగాహన కోసం ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. సేవ్ ది గర్ల్ చైల్డ్ నినాదంతో అవగాహన యాత్ర చేపడుతున్నారు. అందులో భాగంగానే సైకిల్ యాత్ర తర్వాత సీఎం కేసీఆర్‌ను కలుస్తానన్నారు రామాంజనేయరెడ్డి. తాను గీసిన కేసీఆర్ చిత్రపటాన్ని సీఎంకు బహూకరించనున్నట్లు తెలిపాడు.