Ramakrishna Writes Letter To Governor : ఏపీ గవర్నర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ
Ramakrishna Writes Letter To Governor : ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివాదాన్ని పరిష్కరించేందుకు తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు.
న్యాయవ్యవస్థపై గౌరవం, నమ్మకం నిలబెట్టే విధంగా తమ నిర్ణయం ఉంటుందని భావిస్తున్నామన్నారు. రమేష్ కుమార్ ను ఎస్ఈసి గా తొలగిస్తూ, నూతన కమిషనర్ గా కనకరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ లపై మీరు ఆమోదముద్ర వేయకుండా ఉంటే బాగుండేది అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును హైకోర్టుతోసహా సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టిందని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.