Covid19 Tests for Street Childrens in AP: వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19
Covid19 Tests for Street Childrens in AP: కరోనా పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి విషయంలో ఏపీ ముందంజలో ఉంది.
Covid19 Tests for Street Childrens in AP: కరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి విషయంలో ఏపీ ముందంజలో ఉంది. నేరుగా రోగులకు అనుమానితులకు మాత్రమే కాకుండా, వీధి బాలలకు సైతం ముస్కాన్ కోవిద్ 19 పేరుతో పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. దీంతో పాటు ఎక్కడికకక్కడ ఆస్పత్రి స్థాయిని బట్టి జిల్లాలో మూడు, నాలుగు చోట్ల కోవిద్ పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, మొబైల్ బస్సు, వ్యాన్ ల్లో వీటిని చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ విధంగా పరీక్షలను విస్త్రతంగా చేయడం వల్ల వ్యాధిగ్రస్తులన గుర్తించి, వారికి అవసరమైన చికిత్స ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు. అయితే వీధి బాలలకు ముస్కాన్ కోవిద్ -19 పేరుతో చేపట్టిన కోవిద్ పరీక్షలు దేశంలోనే మొదటి సారిగా ఏపీలో చేయడం విశేషం.
రాష్ట్రంలోని వీధి బాలలను గుర్తించి వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించి సంరక్షించే అరుదైన కార్యక్రమం ముస్కాన్ కోవిడ్–19కు విశేష స్పందన లభించింది. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా మూడు రోజుల్లో 837 మంది వీధి బాలలకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. వారిలో ముగ్గురికి కరోనా లక్షణాలు ఉండటంతో వారిని క్వారంటైన్‌కు తరలించారు. ప్రకాశం జిల్లాల్లోని ఇద్దరిని గిద్దలూరు క్వారంటైన్‌కు, విజయనగరం జిల్లాలో ఒకరిని హోం క్వారంటైన్‌ను తరలించారు. ఏపీ సీఐడీ ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ శాఖల సమన్వయంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి సంబంధించిన పలు అంశాలను సీఐడీ అడిషినల్ డీజీ పీవీ సునీల్‌కుమార్ సాక్షికి తెలిపారు.
► డీజీపీ సవాంగ్ ఈ నెల 14న ప్రారంభించిన ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్–19 కార్యక్రమం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోను ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతుంది.
► గడిచిన 3 రోజుల్లో 2,670 మంది వీధి బాలలను పోలీసులు గుర్తించారు. వారిలో 2,339 మంది బాలురు, 331 మంది బాలికలున్నారు. 33 మంది ఇతర రాష్ట్రాల వారున్నారు.
► గుర్తించిన వీధి బాలల్లో 2,500 మందిని తల్లిదండ్రుల వద్దకు చేర్చగా, మరో 170 మందిని సంరక్షణ కేంద్రాలకు తరలించారు.
► బాలికలతో చాకిరీ చేయిస్తున్న వారిపై మూడు కేసులు నమోదు చేయగా, మరో ముగ్గురికి షోకాజ్ నోటీసులిచ్చారు.