Covid Guidelines: శ్రీకాళహస్తి ఆలయంలో కరోనా ఆంక్షలు

Covid Guidelines: అక్కడ.. రాహు, కేతువులు దరిచేరడానికి సాహసం చేయవు.

Update: 2021-05-10 12:15 GMT

Covid Guidelines: శ్రీకాళహస్తి ఆలయంలో కరోనా ఆంక్షలు

Covid Guidelines: అక్కడ.. రాహు, కేతువులు దరిచేరడానికి సాహసం చేయవు. సూర్య, చంద్ర గ్రహణాల ప్రభావం కూడ ఉండదు. కానీ కరోనా మహమ్మారి వైరస్‌ ప్రభావం మాత్రం ఆదేవదేవుడి ఆలయ నిబంధనలపై పడింది. ఎక్కడ వైరస్‌ ఆలయంలోకి చేరుతుందోనన్న అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. భస్మాసురుడి రూపంలో ఉన్న కరోనా వైరస్‌పై హెచ్‌ఎంటీవీ స్పెషల్‌ స్టోరీ.

అది.. 108 దివ్య క్షేత్రాలలో అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రం. గ్రహణకాలంలో సైతం తలుపులు వేయని ఆలయం అది. కాలానికి సంబంధంలేకుండా అక్కడ నిత్య పూజలు, అభిషేకాలు జరుగుతాయి. ఎల్లవేళలా భక్తులకు ఆదేవదేవుడి దర్శనభాగ్యం ఉంటుంది. చెప్పాలంటే, రాహు, కేతువుల ప్రభావం సకల దేవతల ఆలయాల్లో కనిపించినా ఈ ఆలయంలో మాత్రం ఆప్రభావమే కనిపించదు. అదియే శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం.

చెప్పాలంటే ప్రపంచాన్ని కబళించి వేస్తోన్న కరోనా నుంచి జనాన్ని కాపాడే దిశగా జరుగుతున్న ప్రయత్నంలో సృష్టిని పాలించే దేవుళ్ళ ఆలయాలకు కరోనా ఆంక్షలు తప్పడం లేదు. అవును దక్షిణ కాశిగా పేరుగాంచిన శ్రీకాళహస్తి ఆలయంలో సోమవారం నుండి నూతన ఆంక్షలు అమలుకానున్నాయి. రాహు, కేతు సర్ప దోష నివారణ పూజలను అధికారులు రద్దు చేశారు. ఇక ఇతర రాష్ట్రాల ప్రజలకు కొంతకాలం స్వామివారి దర్శన భాగ్యం ఉండకపోవచ్చు.

ఇదిలా ఉండగా ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుండి 8గంటల వరకే భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు అధికారులు. అంతేకాదు ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక కోవిడ్‌ ఉద్ధృతి, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాహు, కేతు పూజలను దేవస్థానం రద్దు చేసింది. అయితే అత్యవసరంగా రాహు, కేతు పూజలు చేయాలనుకునే భక్తులకు పూజారులే గోత్రనామాలతో పూజలు చేసి వారికి వీడియోను పంపించనున్నారు.

Full View


Tags:    

Similar News