Covid Care Center set in Anantapur: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం : 1,500 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్.. ఎక్కడంటే..
Covid Care Center set in Anantapur: కరోనా కట్టడికోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
Covid Care Center set in Anantapur: కరోనా కట్టడికోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.8.50కోట్లతో రాష్ట్రంలో 1,500 పడకలతో భారీ కోవిడ్ కేర్ సెంటర్‌ని నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఈ కోవిడ్ కేర్ సెంటర్ ను అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలోని రామినేపల్లి వద్ద ఉన్న పౌర సరఫరాల సంస్థ గోదాములో నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు ఆల్రెడీ వేగంగా జరుగుతూనే ఉన్నాయి. ఈ కోవిడ్ కేర్ సెంటర్ లో మొత్తం 12 బ్లాక్ లు ఉంటాయి.. ఇందులో రెండు బ్లాక్ లను మాత్రం ప్రత్యేకంగా మహిళల కోసం కేటాయించినట్టు తెలుస్తోంది. అంతేకాదు కరోనా బాధితులకు సేవలు అందించేందుకు వైద్యులు, స్టాఫ్ నర్సులతో పాటు పారిశుద్ధ్య సిబ్బందికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా.. అలాగే వారి కుటుంబసభ్యులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వారికి అక్కడే అన్ని వసతులతో కూడిన నివాస సముదాయాలను ఏర్పాటు చేస్తున్నట్టు అధిఅక్రూలు వెల్లడించారు.
కోవిడ్ పరీక్షల ఫలితాల కోసం అక్కడ రెండు క్లినికల్ ల్యాబోరేటరీలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఈసీజీ, ఎక్స్‌రే, రక్త పరీక్షలు చేయనున్నారు. కోవిడ్ కేర్ సెంటర్‌కు రోగి చేరుకోగానే అక్కడి సైన్‌బోర్డులో వివరాలు నమోదు చేస్తారు. వెంటనే ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేసి.. అక్కడే అతను వుండేట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో రోగి వెంట తెచ్చుకునే సామగ్రి కోసం ఓ ట్రంక్ పెట్టెను కూడా ఇవ్వనున్నారు. పేషంట్ల కోసం వాల్ మౌంట్ ఫ్యాన్లు, ఫెడస్టల్ ఫ్యాన్‌లు ఏర్పాటు చేస్తున్నారు.. అంతేకాదు వారు అక్కడ వేకింగ్ చెయ్యడానికి వీలుగా ర్యాంప్‌లు నిర్మిస్తున్నారు. ఇక రోగులకు భోజనం కోసం ప్రత్యేకంగా వంట గదిని ఏర్పాటు చేస్తున్నారు.