మంత్రి ఉషశ్రీ చరణ్ కి నాన్ బేలబుల్ వారెంట్ జారీ
UshaShri Charan: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించారని కేసు నమోదు
UshaShri Charan: మంత్రి ఉషశ్రీ చరణ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో నింబంధనలు ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించారని బ్రహ్మసముద్రం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారణ చేపట్టిన కల్యాణదుర్గం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్.. మంత్రి ఉషశ్రీతో పాటు మరో ఏడుగురిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టు తీర్పుతో మంత్రి ఉషశ్రీచరణ్ పై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.