Corporation Elections: బెజవాడలో వేడెక్కిన రాజకీయం
Corporation Elections: విజయవాడ సిటీపై పట్టుబిగించేందుకు రాజకీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులతో కదనరంగంలోకి అడుగుపెట్టాయి.
Corporation Elections: బెజవాడలో రాజకీయం వేడెక్కింది. నగర పాలక సంస్థ ఎన్నికల నిర్వహణ ముహూర్తం ఖరారు కావడంతో... సిటీపై పట్టుబిగించేందుకు రాజకీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులతో కదనరంగంలో అడుగుపెట్టాయి. 59 డివిజన్లు ఉన్న నగర పాలక సంస్థ జనాభా ప్రాతిపదికన 64 డివిజన్లుగా విస్తరించింది. దాదాపు 8 లక్షల మంది ఓటర్లున్న ఈ నగరంలో పాగా వేసేందుకు అధికార పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అసలు బెజవాడ కార్పొరేషన్ మేయర్ పీఠంపై ఎవరు పాగా వేస్తారు.. ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.
తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక గుర్తింపు...
రాజకీయాలకు పురిటిగడ్డగా బెజవాడకు తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ ఓటర్లలలో కూడా కొంచెం చైతన్యం ఎక్కువే... నగరానికి చారిత్రాత్మక నేపద్యం ఉన్నా ఆ స్ధాయిలో నగరాభివృద్ది జరగలేదు, ఇక్కడ ప్రజలకు ఆశించినంత మౌళిక వసతులు కల్పన చేయలేదు... బ్రిటిష్ కాలంలోనే విజయవాడ మున్సిపాల్టీగా ఏర్పడింది... కాలక్రమంలో చోటుచేసుకున్న మార్పులకు అనుగుణంగా 1989 నగర పాలకసంస్ధగా మారింది. బెజవాడ పట్టణం నగరంగా మాత్రమే రూపాంతరం చెందింది... కాని ప్రత్యేకంగా ప్రజలకు ఓరిగింది ఏమీ లేదు.విజయవాడ కార్పోరేషన్ గా అభివృద్ది చెందిన తర్వాత మూడు సార్లు ప్రత్యక్షంగా ఎన్నికలు జరిగాయి... ప్రత్యక్షంగా సాగిన ఎన్నికలలో జంద్యాల శంకర్ మేయర్ గా విజయం సాధించారు. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో జరిగిన డైరక్ట్ ఫైట్ లో టీడీపీ మేయర్ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ చేతిలో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధిని తాడి శంకుతల ఓటమి చెందారు. ఆతర్వాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల సంయుక్త అభ్యర్ధిగా రంగంలోకి దిగిన తాడి శకుంతల విజయం సాధించారు... ఏడాది పాటు ఆమె మేయర్ గా కొనసాగారు. ఆ తర్వాత పార్టీల మద్య ఒప్పందం ప్రకారం రత్నబిందు, మరో మైనార్టీ మహిళ మేయర్లుగా పనిచేసారు... అలా సిటీలో మహిళలు మేయర్లుగా కొంచెం ఎక్కువ కాలమే పరిపాలన సాగించారు. తాజాగా ఎన్నికలలో కూడా విజయవాడ నగరం మరోసారి జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. దీంతో కార్పోరేషన్ కుర్చీపై నారీమణులు దృష్టి పడింది...
7 లక్షల 80 వేల మంది ఓటర్లు...
బెజవాడ కార్పోరేషన్ లో 7 లక్షల 80 వేల మంది ఓటర్లు ఉన్నారు.మూడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా కార్పోరేషన్ పరిధిలో కొత్తవాటితో కలిపి 64 డివిజన్లు ఉన్నాయి.ఇందులో అత్యధికంగా సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లు ఉంటే పశ్చిమ నియోజకవర్గంలో 22, తూర్పు నియోజకవర్గంలో 21 డివిజన్లు ఉన్నాయి. గత ఎన్నికలలో తూర్పులో తొమ్మిది, పశ్చిమలో ఏడు, సెంట్రల్ మూడు డివిజన్లు వైసీపీ గెలుచుకుంది. కాని ఈసారి ఎన్నికలలో మూడు నియోజకవర్గాలలో పట్టుసాధించి మేయర్ స్దానాన్ని కైవసం చేసుకోవాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.అందులో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇప్పటికే డివిజన్లలో చక్కెర్లు కొడుతూ ప్రచారం వేగంగా చేస్తున్నారు అభ్యర్ధుల ఎంపిక నుంచి నేటి వరకు ప్రతీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ విష్ణు ముందుకు వెళ్తున్నారు. మోజార్టీ స్దానాలు గెలిచి మేయర్ అతని పరిధిలోకి తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు. ఇక పశ్చిమలో కూడా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అదేప్రయత్నంలో ఉన్నారు. కాని అక్కడ సామాజిక సమీకరణలు కొంచెం ఇబ్బందులు పెడుతున్నా మంత్రి వాటిని అధిగమిస్తారనే దీమా శ్రేణులలో కనిపిస్తోంది. శాసనసభ ఎన్నికలలో వెల్లంపల్లికి వచ్చిన మెజార్టీ అతనిపై పశ్చిమ నియోజకవర్గంలో ఓటర్లకు అతనిపై ఉన్న అభిమానం చాటుకున్నారని, అదేక్రమంలో ఈ సారిగా పశ్చిమలో అత్యధిక కార్పోరేటర్లు విజయం సాదిస్తారనే ధీమాతో ఉన్నారు. ఇక తూర్పు నియోజకవర్గంలో కూడ ఇన్ చార్జిగా ఉన్న దేవినేని అవినాష్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ నియోజకవర్గంలో సామాజిక సమీకరణలో కొంచెం ఢిపరెంట్ గా ఉంటాయి. ఇక్కడ వైసీపీ విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సిందే... ఈ నేపద్యంలోనే యువనేత అవినాష్, సిటీ అధ్యక్షుడు భవకుమార్ గెలుపు గుర్రాలు ఎక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మూడు సెగ్మెంట్లులలో వైసీపీ అభ్యర్ధులు ఎక్కువ మంది గెలిచి మేయర్ స్ధానం సొంతం చేసుకోవాలని పార్టీ అధిస్టానం భావిస్తోంది..
వివిధ విబాగలలో ప్రత్యేక గుర్తింపు...
చారిత్రాత్మక నేపద్యం... వివిధ విబాగలలో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న విజయవాడ మాత్రం అభివృద్ది ఆమడదూరంలో నిలిచిపోయింది.దశాబ్దాల చరిత్రలో ఎవరు అధికారంలో ఉన్నా... రహాదారులు విస్తరణ జరగలేదు, డ్రైనేజీ అభివృద్ది చేయలేదు, నేటికి ట్రాఫిక్ కష్టాలు తీరలేదు... మౌళిక వసతుల విషయం పక్కన పెడితే పట్ణణ ప్రజల కనీస అవసరాలుపై కూడా ఏ ప్రభుత్వం దృష్టి సారించలేదు... ముఖ్యంగా నగరానికి చుట్టూ కొండ ప్రాంతాలున్నాయి... లక్షలాది మంది ఆ కొండలపైనే ఇల్లు నిర్మించుకుని భయం గుప్పెట్లో జీవనం సాగిస్తున్నారు. వారికి సరియైన మార్గం ఉండదు... తాగేందుకు మంచి నీరు సైతం పూర్తి స్థాయిలో పరిస్ధితులు ఈ ప్రధాన నగరాన్ని వెక్కిరిస్తూనే ఉన్నాయి... అటువంటి నగరంపై జగన్ సర్కార్ దృష్టి సారంచింది.నగరంలో ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో నగర ప్రజలు ఎటువైపు మొగ్గు చుపోతారోనని అధికార,ప్రతిపక్షాలలో టెన్షన్ నెలకొంది
పాగా వేసేందుకు వైసీపీ వ్యూహాలు...
మొత్తానికి బెజవాడ కార్పొరేషన్ ఎన్నికలో ఎలాగైనా పాగా వేసేందుకు అధికార వైసీపీ వ్యూహాలు రచిస్తుండగా,ప్రతిపక్ష టీడీపీ మాత్రం వైసీపీకి మేయర్ పీఠం దక్కకుండా గట్టి పోటీ ఇచ్చేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది చూడాలి ప్రజలు ఎవరికి పట్టం కడతారో.