Coronavirus Vaccine: ఏపీకి చేరుకున్న కోవిషీల్డ్‌ టీకా

* పుణె నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వ్యాక్సిన్‌ * గన్నవరంలోని కోల్డ్‌ స్టోరేజీకి వ్యాక్సిన్‌ తరలింపు * తొలి విడతగా ఏపీకి 4.77 లక్షల వ్యాక్సిన్‌ డోసులు

Update: 2021-01-12 10:14 GMT
Covishield Coronavaccine

కరోనాతో చిగురుటాకులా వణికిన భారత్‌కు కొంత ఉపశమనం దొరికింది. ఎప్పుడెప్పుడా అని అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న కొవిడ్‌ వ్యాక్సినేషన్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. తొలిదశ వ్యాక్సిన్‌ రవాణాలో భాగంగా కొవిషీల్డ్‌ టీకా డోసులు పుణె నుంచి విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. అక్కడి నుంచి ప్రత్యేక బందోబస్తుతో గన్నవరంలోని కోల్డ్‌ స్టోరేజీలకు వ్యాక్సిన్‌ను తరలించారు అధికారులు.

ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. తొలి విడతగా ఏపీకి 4 లక్షల 77 వేల కొవిషీల్డ్‌ డోసులు చేరుకున్నాయి. ముందుగా మెడికల్‌ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. గన్నవరం కోల్డ్‌ స్టోరేజీ నుంచి అన్ని జిల్లాలకు ప్రత్యేక వాహనాల ద్వారా టీకాను పంపిణీ చేయనున్నారు. రవాణాకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు స్పష్టం చేశారు.

గన్నవరంలోని ఏపీ స్టేట్ వ్యాక్సిన్ కేంద్రానికి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ చేరుకుంది. ముందుగా మెడికల్‌ సిబ్బందికి, ఆ తర్వాత ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు, తదుపరి మిగిలిన వారికి వ్యాక్సిన్ ఇస్తారని అధికారులు చెబుతున్నారు. 2 నుంచి 8 డిగ్రీల స్టోరేజి వద్ద వ్యాక్సిన్ ను ఉంచి, అన్ని జిల్లాలకు సరఫరా చేస్తారంటున్న స్టేట్ హెల్త్‌ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీహరి.

Tags:    

Similar News