Coronavirus updates in AP: ఏపీలో కరోనా కల్లోలం.. మళ్లీ పెరిగిన కేసులు
Coronavirus updates in AP: ఏపీని కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకూ భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నేడు కూడా అదే పరిస్థితి ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 9,747 కేసులు నమోదయ్యాయి.
Coronavirus updates in AP: ఏపీని కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకూ భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నేడు కూడా అదే పరిస్థితి ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 9,747 కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1, 76,333కు చేరుకుంది. గడిచిన 24 గంట్లలో 95,625 మంది బాధితులు వ్యాధి బారి నుంచి కోలుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 79,104 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కాగా గడిచిన 24 గంటల్లో 64,147 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. 67 మంది వైరస్ కు బలైయ్యారు.
జిల్లాల వారీగా కేసులు:
అత్యధికంగా తూర్పుగోదావరిలో 1371 కేసులు నమోదు కాగా, అనంతపురంలో 1325, కర్నూలు లో 1016, గుంటూరులో 940, విశాఖలో 863, కడపలో 765, పశ్చిమగోదావరిలో 612, విజయనగరంలో 591, నెల్లూరులో 557, శ్రీకాకుళంలో537, చిత్తూరులో 526, కృష్ణాలో 420, ప్రకాశంలో 224 కేసులు నమోదయ్యాయి.
జిల్లాల వారీగా మృతుల వివరాల:
గుంటూరు లో 12, కృష్ణాలో 9, కర్నూలులో 8, చిత్తూరులో 7, తూర్పుగోదావరిలో 7, నెల్లూరులో 7, అనంతపురంలో 6, శ్రీకాకుళంలో 6, విశాఖలో 2, ప్రకాశంలో 1, విజయనగరంలో 1, పశ్చిమగోదావరిలో 1 మరణించారు.