ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు!

Coronavirus Updates in AP: ఏపీలో క్రమంగా పెరుగుతూ వచ్చిన కరోనా కేసులు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి.. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,224 కేసులు నమోదు అయ్యాయి.

Update: 2020-10-12 14:06 GMT

coronavirus 

Coronavirus Updates in AP: ఏపీలో క్రమంగా పెరుగుతూ వచ్చిన కరోనా కేసులు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి.. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,224 కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,58,951 కు చేరుకుంది. ఇందులో 43,983 యాక్టివ్ కేసులు ఉండగా, 7,58,951 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో 32 మంది మరణించారు. దీనితో మృతుల సంఖ్య 6256కి చేరుకుంది.

కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఐదు మంది చొప్పున, గుంటూరు 4, కడప 4, అనంతపురం 3, తూర్పుగోదావరి 3, చిత్తూరు 2, పశ్చిమగోదావరి 2, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 66,30,728 నమూనాలను పరీక్షించారు.

ఇక జిల్లాల పరంగా కేసుల విషయానికి వచ్చేసరికి అనంతపుర్ జిల్లాలో 209, చిత్తూరులో 293, ఈస్ట్ గోదావరి లో 547, గుంటూరులో 379, కడపలో 190, కృష్ణలో 86, కర్నూలు 136, నెల్లూరులో 166, ప్రకాశం 270, శ్రీకాకుళంలో 133, విశాఖపట్నంలో 135, విజయనగరంలో 191, వెస్ట్ గోదావరి లో 489 కేసులు నమోదయ్యాయి.



Tags:    

Similar News