Coronavirus Updates in Andhrapradesh: ఏపీలో ఒక్క రోజే 17 మంది మృతి.. రికార్డు స్థాయిలో కేసులు
Coronavirus Updates in Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి క్రమంగా భయాందోళన పెంచుతోంది. గడిచిన 24 గంటల్లో గరిష్టంగా 1813 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..
Coronavirus Updates in Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి క్రమంగా భయాందోళన పెంచుతోంది. గడిచిన 24 గంటల్లో గరిష్టంగా 1813 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇప్పటివరకూ నమోదైన కేసులలో ఇవే అత్యధికం.. అయితే రాష్ట్రానికి సంబంధించిన కరోనా పాజిటివ్ కేసులు 1775 గా ఉన్నాయి.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 34 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి సంఖ్య 2385 కి చేరుకుంది. అలాగే ఇతర దేశాల నుండి వచ్చిన వారి సంఖ్య 428 కే చేరింది. రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27235 వున్నాయ్. గడచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ తో 17 మంది మృతి చెందారు.
కోవిడ్ తో కర్నూల్ లో నలుగురు, గుంటూరులో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, కృష్ణలో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు, అనంత పురం, కడప, విశాఖలో ఒక్కొక్కరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు 309 మంది కరోనా కారణంగా మరణించారు. గడచిన 24 గంటల్లో వివిధ ఆసుపత్రుల నుండి 1168 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు 14393 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో మొత్తం 20590 శాంపిల్స్ లను పరీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 11,36,225 శాంపిల్స్ లను పరీక్షించడం జరిగింది. రాష్ట్రంలో కరోనా నుండి ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 12533 గా ఉంది.