Coronavirus updates in AP: ఏపీలో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు
Coronavirus updates in AP: ఏపీని కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకూ భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Coronavirus updates in AP: ఏపీని కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకూ భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.గత 24 గంటల్లో 52,834 శాంపిల్స్ పరీక్షించగా 8,555 కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య లక్షా 58 వేల 764కి చేరుకుంది. మొత్తం కేసుల్లో 74,404 యాక్టివ్ కేసులు ఉండగా.. 82, 886 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా 24 గంటల్లో 6,272 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా డిశ్చార్జ్ అయ్యారు. 67 మంది వైరస్ కరణంగా మరణించారు. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1474 మంది కరోనాతో చనిపోయారు.
ఇవాళ నమోదైన కేసుల్లో విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 1227 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. అంతేకాదు ఈ జిల్లాలో ఒకే రోజు ఏడుగురు కరోనాతో మృతి చెందారు. అటు జిల్లాల వారీగా నమోదైన కేసులు చూస్తే.. అనంతపురం 696, చిత్తూరు 781, తూర్పుగోదావరి 930, గుంటూరు 639, కడప 396, కృష్ణ 379, కర్నూలు 996, నెల్లూరు 448, ప్రకాశం 384, శ్రీకాకుళం 492, విజయనగరం 637, పశ్చిమ గోదావరిలో 550 కేసులు నమోదయ్యాయి.
కొత్తగా నమోదైన ఇవాళ చనిపోయిన వారిలో అనంతపురం-02, కృష్ణా జిల్లా-11, పశ్చిమగోదావరి-02, గుంటూరులో-08, తూర్పుగోదావరి-07,నెల్లూరు-06, విశాఖపట్నం-07, కర్నూలు-06, శ్రీకాకుళం-05, ప్రకాశం-04, చిత్తూరు-03, కడప-03, విజయనగరం-03మంది మరణించారని ఆరోగ్య శాఖ పేర్కొంది.