Coronavirus updates in AndhraPradesh: ఏపీలో రిక్డార్ స్థాయిలో క‌రోనా కేసులు

Coronavirus updates in AndhraPradesh: ఏపీలో కరోనా విజృంభ‌ణ కొన‌సాగుతుంది. ప్ర‌భుత్వం ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్న‌ వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్ లోకి రాలేదు. రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు నిర్వహిస్తుండగా, దానికి అనుగుణంగా కొత్త కేసులు భారీగా బయటపడుతున్నాయి

Update: 2020-08-26 15:04 GMT

కరోనా  

Coronavirus updates in AndhraPradesh: ఏపీలో కరోనా విజృంభ‌ణ కొన‌సాగుతుంది. ప్ర‌భుత్వం ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్న‌ వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్ లోకి రాలేదు. రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు నిర్వహిస్తుండగా, దానికి అనుగుణంగా కొత్త కేసులు భారీగా బయటపడుతున్నాయి. జాతీయ సగటును ఎప్పుడో దాటేయగా... ఇప్పుడు ఇతర రాష్ట్రాలనూ అధిగమిస్తోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ బుధ‌వారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 10,830 కరోనా కేసులు నమోదయ్యాయి కేసుల సంఖ్య 3,82,469కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 2,86,720 మంది డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 92,208 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఏపీలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో అత్య‌ధికంగా 34,18,690 కరోనా టెస్టుల చేయ‌డం గ‌మ‌న‌ర్హం.

అలాగే గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో కరోనాతో 81 మంది మృతి చెందారు. ఇందులో తూర్పుగోదావరిలో 11, ప్రకాశం 9, చిత్తూరు 8, కడపలో 8 మంది, అనంతపురం 6, పశ్చిమగోదావరి 6, కృష్ణా జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. ఇక.. కర్నూలు, నెల్లూరు, విశాఖ, విజయనగరంలో ఐదుగురు చొప్పున మృతి చెందారు. గుంటూరు, శ్రీకాకుళంలో నలుగురు చొప్పున మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో 3,541 మంది మృతి చెందారు. బుధవారం నమోదయిన అత్యధిక కేసులు వివరాలు.. తూర్పుగోదావరి జిల్లాలో 1,528, పశ్చిమగోదావరి 1,065, విశాఖ 1,156, నెల్లూరులో 1,168 కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News