Corona Updates in AP: ఏపీలో కరోనా కరాళ నృత్యం.. రెండు లక్షల మార్క్ దాటిన కేసులు
Corona Updates in AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 62,938 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 10,171 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
Corona Updates in AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 62,938 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 10,171 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,06,960 కు చేరింది. కొత్తగా 7,594 మంది వైరస్ నుంచి కోలుకోగా... మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,20,464కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 89 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని మృతి చెందిన వారి సంఖ్య 1842కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 84,654 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 23,62,270 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని ఏపీ వైద్య శాఖ వెల్లడించింది.
గడిచిన 24 గంటల్లో కర్నూలులో జిల్లాలో 1331, తూర్పు గోదావరిలో 1270, అనంతపురంలో 1100, చిత్తూరులో 980, నెల్లూరులో 941, విశాఖపట్నంలో 852, గుంటూరులో 817, కడపలో 596, పశ్చిమ గోదావరిలో 548, విజయనగరంలో 530, శ్రీకాకుళంలో 449, కృష్ణాలో 420, ప్రకాశం జిల్లాలో 337 కేసులు నమోదయ్యాాయి. అలాగే కరోనా కు బలైన సంఖ్య జిల్లాల వారిగా. చిత్తూర్ లో 10, అనంతపురం 9, గుంటూరు 9, నెల్లూరు 9, పశ్చిమ గోదావరి 9, తూర్పు గోదావరి 7, కడప 7, ప్రకాశం 7, కృష్ణా 7, కర్నూలు 6, విశాఖపట్నం 5, శ్రీకాకుళం 3, విజయనగరంలో 3గురు మరణించారు.