Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 9,393 పాజిటివ్ కేసులు..
Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.
Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 9,393 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 55,551 శాంపిల్స్‌ని పరీక్షించగా 9,393 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 8,846 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 95 మంది ప్రాణాలు కోల్పోయారు.
చిత్తూరు జిల్లా 16, ప్రకాశం జిల్లా 11, నెల్లూరు జిల్లా 09, అనంతపురం జిల్లా 08, తూర్పు గోదావరి జిల్లా 08, పశ్చిమ గోదావరి జిల్లా 08, కడప జిల్లాలో 07, గుంటూరు జిల్లా 06, విశాఖపట్నం జిల్లా 06, కర్నూలు జిల్లా 06, శ్రీకాకుళం జిల్లా 06, విజయనగరం జిల్లా 03, కృష్ణ జిల్లా 03, కరోనా బారిన పడి మరణించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 3,25,396. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 2,906. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా 45,356 కర్నూల్ జిల్లా 36, 381 అనంతపురం జిల్లా 32, 603 కేసులు నమోదు.
ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,35,218 కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 87,177 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 55,551 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు మొత్తంగా 30,74,847 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.