Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 7,293 పాజిటివ్ కేసులు!
Coronavirus Updates In AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు తాజాగా గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 7,293 కరోనా కేసులు నమోదయ్యాయి.. తాజా కేసులతో కలిపి రాష్ట్రములో కరోనా కరోనా కేసుల సంఖ్య 6,68,751కు చేరుకుంది.
Coronavirus Updates In AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు తాజాగా గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 7,293 కరోనా కేసులు నమోదయ్యాయి.. తాజా కేసులతో కలిపి రాష్ట్రములో కరోనా కేసుల సంఖ్య 6,68,751కు చేరుకుంది. ఇందులో 65,794 యాక్టివ్ కేసులు ఉండగా 5,97,294 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. తాజాగా మరో 57 మంది కరోనాతో పోరాడి మృతి చెందారు.. దీనితో మృతి చెందిన వారి సంఖ్య 5,663కి చేరుకుంది.. ఇక గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 75, 990 టెస్టుల చేయగా, మొత్తం టెస్టుల సంఖ్య 55,23,786 కి చేరుకుంది.. 9,125 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
కోవిడ్ వల్ల ప్రకాశం జిల్లాలో పది మంది, చిత్తూరు జిల్లాలో ఎనిమిది మంది, కడప జిల్లాలో ఎనిమిది మంది, కృష్ణ జిల్లాలో ఆరుగురు, విశాఖపట్నం జిల్లాలో ఐదుగురు, తూర్పు గోదావరి జిల్లాలో నలుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, అనంతపూర్ జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు, కర్నూల్ జిల్లాలో ఒక్కరు మరియు విజయనగరం జిల్లాలో ఒక్కరు మరణించారు.
ఇక జిల్లాల వారిగా లెక్కలు చూసుకుంటే.. అనంతపూర్ జిల్లాలో 513, చిత్తూరు జిల్లాలో 975, తూర్పు గోదావరి జిల్లాలో 1011, గుంటూరు జిల్లాలో 393, కడప జిల్లాలో 537, కృష్ణ జిల్లాలో450, కర్నూల్ జిల్లాలో 206, నెల్లూరు జిల్లాలో 466, ప్రకాశం జిల్లాలో 620, శ్రీకాకుళం జిల్లాలో 306, విశాఖపట్నం జిల్లాలో 450, విజయనగరం జిల్లాలో 444, పశ్చిమ గోదావరి జిల్లాలో 922 కేసులు నమోదు అయ్యాయి.