Coronavirus updates in Andhra Pradesh: ఏపీలో గత 24 గంటల్లో రికవరీలు చూస్తే..
Coronavirus updates in Andhra Pradesh: ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజువారీ కేసులు.. ఈవారం నుంచి ఐదువేల కేసులు రావడం ప్రారంభం అయింది.
Coronavirus updates in Andhra pradesh: ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజువారీ కేసులు.. ఈవారం నుంచి ఐదువేల కేసులు రావడం ప్రారంభం అయింది. అయితే సోమ మంగళ వారాల్లో నాలుగు వేలు ఉండగా.. తాజాగా ఆరువేలు దాటాయి. గత 24 గంటల్లో (నిన్న ఉదయం 9 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 వరకూ) మొత్తం 49,553 టెస్టులు చేశారు. దాంతో 6,045 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే భారీ ఊరట కలిగించే విషయం ఏమిటంటే.. కొత్తగా 6,494మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. డిశ్చార్జ్ కు ఏ రోజూ 15 వందలు దాటలేదు. ఇప్పుడు ఏకంగా ఆరువేలు దాటడం సంతోషాన్ని కలిగిస్తోంది. ఇక కరోనా రోగం వలన గుంటూరు లో 15 మంది,
కృష్ణ లో 10 మంది, పశ్చిమ గోదావరి లో 8 మంది, తూర్పు గోదావరి లో 7గురు, చిత్తూర్ లో 5గురు, కర్నూల్ లో 5గురు, విజయనగరం లో నలుగురు, ప్రకాశం లో ముగ్గురు, శ్రీకాకుళం లో ముగ్గురు, విశాఖపట్నం లో ముగ్గురు,కడప లో ఒక్కరు మరియు నెల్లూరు లో ఒక్కరు మరణించారు. ఇక ఇప్పయివరకూ రాష్ట్రంలో మొత్తం 14,35,827 మంది పరీక్షలు చేశారు. ఇదిలావుంటే రాష్ట్రం లోని నమోదైన మొత్తం 61,818 పాజిటివ్ కేసు లకు గాను 29,390 మంది డిశ్చార్జ్ అయ్యారు.. కోవిడ్ భారిన పడి 823 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 31,605 గా ఉంది.