Coronavirus Updates in AP: ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు
Coronavirus Updates in AP: ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. శనివారం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు వచ్చాయి.
Coronavirus Updates in AP: ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. శనివారం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు వచ్చాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 23,872 సాంపిల్స్ ని పరీక్షించగా 3,963 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే 1411 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ వల్ల తూర్పు గోదావరి లో పన్నెండు మంది, గుంటూరు లో ఎనిమిది మంది, కృష్ణ లో ఎనిమిది మంది, అనంతపురంలో ఏడుగురు, పశ్చిమ గోదావరి లో ఐదుగురు, ప్రకాశం లో నలుగురు, నెల్లూరు లో ముగ్గురు, విశాఖపట్నం లో ఇద్దరు, చిత్తూర్ లో ఒక్కరు, కడప లో ఒక్కరు మరియు విజయనగరం లో ఒక్కరు మరణించారు.
నేటి వరకు రాష్ట్రంలో 12,84,384 సాంపిల్స్ ని పరీక్షించడం పరీక్షించారు. ఇక రాష్ట్రం లోని నమోదైన మొత్తం 41,714 పాజిటివ్ కేసు లకు గాను 19,223 మంది డిశ్చార్జ్ కాగా.. 586 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 21,905 గా ఉంది. ఇక అన్ని జిల్లాల్లో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య ఇలా ఉంది. కర్నూల్ 3138, కడప 1082, అనంతపురం 1823, చిత్తూరు 2750, నెల్లూరు 1186, ఒంగోలు 579, గుంటూరు 2112, కృష్ణ 910, పశ్చిమ గోదావరి 1457, తూర్పు గోదావరి 4202, విశాఖపట్నం 518, విజయనగరం 887, శ్రీకాకుళం 1261 గా ఉన్నాయి.