Coronavirus Updates in AP: ఏపీలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా వైరస్ కేసులు..
Coronavirus Updates in AP: ఏపీలో రోజురోజుకీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే..
Coronavirus Updates in AP: ఏపీలో రోజురోజుకీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడచిన 24 గంటల్లో కొత్తగా రాష్ట్రంలో 1909 మంది కరోనా బారిన పడ్డారు.. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 33,019 కి చేరుకుంది. ఇక 952 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇక కరోనా వలన గడిచిన 24 గంటల్లో అనంతపూర్ లో పది మంది, పశ్చిమ గోదావరిలో తొమ్మిదిమంది, చిత్తూరులో ఐదుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు, కడప జిల్లాలో ఐదుగురు, కర్నూలు జిల్లాలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, విజయవాడ లో ఇద్దరు, విజయనగరం లో ఒకరు మృతి చెందారు..
ఇక గడిచిన 24 గంటల్లో 22,670 శాంపిల్స్ ని పరీక్షించగా, 1909 మందికి కరొనా సోకినట్టుగా నిర్ధారణ అయింది. దీనితో ఇప్పటివరకు ఏపీలో 11,95,776 శాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.. ప్రస్తుతం రాష్ట్రంలో 14,528 యాక్టివ్ కేసులు ఉండగా, 15,227 మంది డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో కరోనాతో 408 మంది మృతి చెందారు.. దీనికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది..
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. లాక్ డౌన్ సడలింపులు తర్వాత కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతూ ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది.. ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 28,498 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 553 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి కరోనా కేసుల సంఖ్య 9,06,752కు చేరుకుంది. అయితే ఇందులో 3,11,565 యాక్టివ్ కేసులు ఉండగా, 5,71,460 మంది కొలుకున్నారు..