Coronavirus Updates in AP: ఏపీలో అత్యధికంగా 10,376 కేసులు.. 68 మరణాలు..
Coronavirus updates in AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన వారం రోజులుగా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
Coronavirus updates in AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన వారం రోజులుగా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 61,699 శాంపిల్స్ టెస్టు చేయగా.. అందులో 10,376 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,40,933 కి చేరింది. గడచిన 24 గంటల్లో 68మంది చనిపోయారు. దీంతోమొత్తం మరణాల సంఖ్య 1349కి చేరింది. గత 24 గంటల్లో 3,822 మంది కరోనా నుంచి కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. మొత్తం కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 63,864కు చేరింది. మరో75, 720 మంది హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు.
గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1215, కర్నూలు జిల్లాలో 1124, విశాఖపట్నం జిల్లాలో 983, పశ్చిమగోదావరి జిల్లాలో 956, అనంతపురం జిల్లాలో 1387, గుంటూరు జిల్లా 906, కడప జిల్లాలో 664, నెల్లూరు జిల్లాలో 861, శ్రీకాకుళం జిల్లాలో 402, చిత్తూరు జిల్లాలో 789, ప్రకాశం జిల్లాలో 406, కృష్ణా జిల్లాలో 313, విజయనగరం జిల్లా 388 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 20,395 పాజిటివ్ కేసులు.. తర్వాత కర్నూలు జిల్లాలో కేసులు 16,847కు చేరాయి. అనంతపురం జిల్లాలో 14, 699 కేసులు ఉన్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 19,51,776 సంప్లిల్స్ ను పరిక్షించడం జరిగింది.