Coronavirus In AP Police Department: ఏపీలో 470 మంది పోలీసులకు కరోనా!
Coronavirus In AP Police Department: కరోనా పై దేశం చేస్తున్న పోరాటంలో భాగంగా వైద్యులు, పారిశుధ్య కార్మికులు, పోలిసుల కృషి వెలకట్టలేనిది.
Coronavirus In AP Police Department: కరోనా పై దేశం చేస్తున్న పోరాటంలో భాగంగా వైద్యులు, పారిశుధ్య కార్మికులు, పోలిసుల కృషి వెలకట్టలేనిది. ఇందులో పోలీసులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. ఇలా విధులు నిర్వహిస్తున్న సమయంలో కొన్ని చోట్లల్లో పోలీసులు కరోనా బారినా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీలో దాదాపుగా 470 మంది పోలీసులు ఈ వ్యాధికి గురైనట్లు ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సావాంగ్ తెలిపారు.
ఆదివారం 'మీట్-ది-ప్రెస్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పోలిసుల సేవలను ప్రశంసిస్తూ.. కరోనాతో బాధపడుతున్న పోలీసులు సంఖ్య పెరుగుతున్నందున మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఇక కరోనా లక్షణాలు కనిపించినట్టు అయితే వెంటనే పై అధికారులకి సమాచారం అందించి తగిన చికిత్సను తీసుకోవాలని అన్నారు. అంతేకాకుండా ఆరోగ్యం కాపాడుకోవడం కోసం సరైన ఆహారం తీసుకోవాలని సూచించారు.
ఇక ఏపీలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి ఈరోజు (ఆదివారం) రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. కొత్తగా 20,567 సాంపిల్స్ ని పరీక్షించగా 961 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 391 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్ట్ అయ్యారు. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 10,17,140 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.రాష్ట్రంలో 7907 మంది ప్రభుత్వ ఆసుపత్రులలో, అలాగే 2136 మంది కోవిడ్ కేర్ సెంటర్స్ లో వెరసి మొత్తం 10043 మంది చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రం లోని నమోదైన మొత్తం 16,102 పాజిటివ్ కేసు లకు గాను 6828 మంది డిశ్చార్జ్ కాగా 232 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 9042 గా ఉంది.