Coronavirus Effect: కరోనాతో కొడుకు, గుండె పగిలి తండ్రి మరణం
Coronavirus Effect: కరోనా మహమ్మారి జీవితాల్ని నాశనం చేస్తోంది. ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన కలచి వేస్తోంది.
Coronavirus Effect: కరోనా మహమ్మారి జీవితాల్ని నాశనం చేస్తోంది. ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన కలచి వేస్తోంది. కొడుక్కి కరోనా సోకగా గుండెపోటుతో తండ్రి మరణించగా, కుమారుడు సైతం ఆయన్నే అనుసరించాడు. కరోనా వైరస్ సోకిన వారు మాత్రమే మరణిస్తారు అనుకోవటం పొరపాటు. ఈ కరోనా మానవ సంబంధాలను, మమతానురాగాలను తెంచటమే కాదు రక్త సంబంధికుల మధ్య ఎంత బలంగా ఉన్నాయో కూడా చూపించిన ఘటన ఇది.
చిత్తూరు జిల్లా నగరి మండలం ఏకాంబరకుప్పంలో జరిగిన ఈ ఘటన విషయం తెలిసిన ప్రతి ఒక్కరిని బాధపడేలా చేస్తుంది. ఓ వ్యక్తికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. తిరిగి వస్తాను అనుకున్న దైర్యంతో అతను ఆసుపత్రికి వెళ్లాడు. కానీ కరోనాపై నెలకొన్న భయాలతో ఆ వ్యక్తి తండ్రి అయిన 68ఏళ్ల వృద్ధుడు మనోవేధనతో గుండె పోటుతో మరణించాడు.
తండ్రికి అంత్యక్రియలు చేసే స్థితిలో ఆ కొడుకు లేడు. నా అనుకున్న బందువులు సైతం కొడుక్కు కరోనా ఉందన్న అనుమానంతో అంత్యక్రియలకు ముఖం చాటేశారు. దీంతో మానవత్వంతో స్థానిక సీఐ మద్దయ్య చారి దగ్గరుండి అంత్యక్రియలు చేశాడు. కానీ తండ్రి అంత్యక్రియలకు ముందే కొడుకు కరోనా వ్యాధికి బలైపోయాడు. తండ్రి, కొడుల మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సొంత బంధువులే అనుమానంతో దూరం అయిన సందర్భం ఒకటైతే, కొడుకు ఎలా ఉంటాడో అన్న తండ్రి ప్రేమతో గుండె పగిలి మరణించటం అందర్నీ ఆలోచింప చేస్తుంది.