Coronavirus Effect in AP Assembly: ఏపీ అసెంబ్లీ, సెక్రటేరియేట్లలో కరోనా కలకలం
Coronavirus Effect in AP Assembly: ఏపీ అసెంబ్లీ, సెక్రటేరియేట్లలో కరోనా కలకలం రేపుతోంది.
Coronavirus Effect in AP Assembly & Secretariat Office: ఏపీ అసెంబ్లీ, సెక్రటేరియేట్లలో కరోనా కలకలం రేపుతోంది. సచివాలయంలో మరో 10మంది ఉద్యోగులకు వైరస్ సోకింది. ఇక, అసెంబ్లీలోనూ ఇద్దరు ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. దాంతో, సచివాలయం, అసెంబ్లీల్లో కరోనా కేసులు 30కి చేరాయి. ఇక, ఇరిగేషన్ శాఖలో కొత్తగా ముగ్గురికి కరోనా నిర్ధారణ కావడంతో.... జులై 14వరకు ఇంటినుంచే పనిచేయాలని ఆ శాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 13,625. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 198. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 5868కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 7,559 మంది చికిత్స పొందుతున్నారు.