Coronavirus Effect Devotees Visit Suspended: నేటి నుంచి వారం రోజుల పాటు దర్శనాలు నిలిపివేత.. శ్రీశైలంలో కేసులు పెరుగుతున్న కేసులు
Coronavirus Effect Devotees Visit Suspended: శ్రీశైలం దేవాలయంపై కరోనా ఎఫెక్ట్ పడింది.
Coronavirus Effect Devotees Visit Suspended: శ్రీశైలం దేవాలయంపై కరోనా ఎఫెక్ట్ పడింది. అక్కడ కేసులు ఎక్కువ కావడంతో పాటు ఆలయ అర్చకులు ఇతర సిబ్బందికి కరోనా సోకడంతో వారం రోజల పాటు దర్శనాలు నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. వీటికి సంబంధించి అదుపులోకి వచ్చిన తరువాతే తిరిగి దర్శనాలను పున:ప్రారంభిస్తామని ఆలయ ఈవో రామారావు తెలిపారు.
శ్రీశైలం దేవస్థానంలో కరోనా కల్లోలం రేపుతుంది. శ్రీశైలంలో ఒక్కరోజే 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శ్రీశైలం దేవస్థానం వైద్యశాల వైద్యుడితో పాటు, ముగ్గురి సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. శ్రీశైలం మండలం లో ఇప్పటివరకు 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీశైలం దేవస్థానంలో వారంపాటు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఒకేరోజు 13 కరోనా కేసులు నిర్ధారణ కావడంతో ఆలయ ఉద్యోగులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీశైలం దేవస్థానంపై కరోనా వైరస్ ప్రభావం పడింది. కరోనా ప్రభావంతో ఉద్యోగులు, అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించారు. శ్రీశైలంలో కొంత మంది ఉద్యోగులతోపాటు పనిచేసేవారికి కరోనా పాజిటివ్ రావడంతో ఆలయంలో స్వామిఅమ్మవార్ల దర్శనాలు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయంలో భక్తులు లేకుండా యధావిధిగా నిత్యకైంకర్యాలు పూజలు, పరోక్ష సేవలను కొనసాగిస్తామని ఈవో కేఎస్ రామారావు తెలిపారు. శ్రీశైలంలో కరోనా పాజిటివ్ కేసులు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో స్వామిఅమ్మవార్ల దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొన్నారు. వారం రోజులపాటు శ్రీశైలం ఆలయం పరిసర ప్రాంతాల్లో దేవాదాయశాఖ అధికారులు లాక్ డౌన్ ప్రకటించారు.