విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కరోనా కలకలం.. ఒక్కరోజే 60 కేసులు...

Vizag Steel Plant: *ఫస్ట్, సెకండ్ వేవ్‌లలో కుదేలైన కార్మిక కుటుంబాలు *థర్డ్ వేవ్‌లోనైనా తమను కావాడాలని విజ్ఞప్తి

Update: 2022-01-12 02:45 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కరోనా కలకలం.. ఒక్కరోజే 60 కేసులు...

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కరోనా వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. ఒక్కరోజే 60 కేసులు నమోదు కావడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన రెండు వేవ్‌లలో కార్మికుల కుటుంబాలలో కరోనా పెను విషాదం మిగల్చడంతో.... థర్డ్ వేవ్‌లో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవల్సి వస్తుందోనని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న వైనంపై హెచ్ఎం టీవీ స్పెషల్ డ్రైవ్..

కరోనా మొదటి, రెండు వేవ్‌లలో చేదు అనుభవాలను చవి చూసిన విశాఖ ఉక్కు పరిశ్రమలో థర్డ్ వేవ్ కలకలం రేపుతోంది. ఒక్కరోజే 60 మందికి పైగా కొత్త కేసులు నమోదు కావడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు ఉక్కునగరంలోని పలు సెక్టార్లతో పాటు, కూర్మన్నపాలెం, అగనంపూడి, గొల్లలపాలెం, దేశపాత్రనిపాలెం, పెందుర్తి, షీలానగర్, వుడా ఫేజ్-7, సిద్ధార్థనగలో నివాసం ఉంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులోనే గరిష్ట స్థాయిలో పాజిటీవ్ కేసులు రావడం ఇదే తొలిసారి కావడంతో కార్మికులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు విశాఖ జిల్లా వ్యాప్తంగా కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. జిల్లాలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌లతో పోలిస్తే ఈసారి మరింత వేగంగా వైరస్ విస్తరిస్తోంది. గతంలో కనీసం రెండు నుంచి మూడు వారాల తరువాత రోజువారీ కేసుల పెరుగుదలలో వేగం కనిపించేది. కానీ, ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అయితే ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

రెండవ వేవ్ లో ఏర్పడిన ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి కేజీహెచ్ ఆసుపత్రితో పాటు జిల్లా వ్యాప్తంగా మరికొన్ని ఆసుపత్రులలో ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించారు. థర్డ్ వేవ్ ను ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. యాజమాన్యం, ప్రభుత్వం చొరవ తీసుకొని ఉక్కు పరిశ్రమలో కరోనా వ్యాప్తిని నిరోధించాలని కార్మికులు కోరుతున్నారు. మరో వైపు కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాధికారులు భరోసానిస్తున్నారు.

Tags:    

Similar News