Corona vaccine: వ్యాక్సిన్ పంపిణీ పై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: సీఎస్ అదిత్యానాథ్ దాస్

Corona vaccine: * తొలి విడతలో హెల్తుకేర్ వర్కర్లు,ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రాధాన్యత * సుమారు కోటి మందికి ఇంజక్సన్లు ఇచ్చేందుకు చర్యలు

Update: 2021-01-07 01:08 GMT

కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ పై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది..వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి కీలక శాఖలతో ఏపీ సీఎస్ అదిత్యానాథ్ దాస్ సమీక్ష నిర్వహించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తొలివిడతగా ప్రభుత్వ, ప్రైవేట్ హెల్త్ కేర్ సిబ్బందితో పాటు ఐసీడీఎస్ వర్కర్లకు కోవిడ్ వ్యాక్సిన్ అందించనున్నట్లు ప్రకటించారు.

కోవిడ్ వైరస్ నియంత్రణలో భాగంగా త్వరలో చేపట్టనున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ఏపీ సచివాలయంలో రాష్ర్ట స్థాయి కోవిడ్ వ్యాక్సినేషన్ స్టీరింగ్ కమిటీ భేటీ అయ్యింది. ఏపీ సీఎస్ ఆధిత్యనాధ్ దాస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్రం సూచనల మేరకు వ్యాక్సిన పంపిణీకి సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఫ్రంట్ లైన్ వర్కర్ల డేటాను శాఖల వారీగా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.

తొలి విడతలో సుమారు కోటి మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు సీఎస్ ఆధిత్యానాథ్ దాస్ స్పష్టం చేశారు. పోలింగ్ బూత్ తరహాలో వ్యాక్సిన్‌ సెంటర్లను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. వ్యాక్సిన్ పంపిణీపై మండల స్థాయిలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటుకు ఆదేశించారు. అలాగే 50యేళ్ళ వయస్సు నిండి చక్కెర వ్యాధి,హైపర్ టెన్సన్,క్యాన్సర్ ఊపిరి తిత్తులు వ్యాధితో ఇబ్బంది పడే వారికి కూడా తొలి విడత ఇంజిక్షన్లు వేయడంలో ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ పంపిణీ సన్నద్దపై వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ప్రజంటేషన్ అందించారు.నెలకు ఒక సారి రాష్ర్ట స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశమవుతుందని జిల్లా స్థాయిలోనూ కలెక్టర్ అధ్యక్షతన, మండల స్థాయిలో తహశీల్దార్ అధ్యక్షతన,

మున్సిపాల్టీ స్థాయిలో మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన సంబంధిత శాఖలతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్సు కమిటీలు వారానికి ఒకసారి సమావేశమై కొవిడ్ వ్యాక్సిన్ సంబంధించిన అంశాలపై సమీక్షిస్తారని సీఎస్ తెలిపారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఫిర్యాదులు, సూచనలు, సలహాలు తీసుకుని వాటిని సత్వరం పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర, జిల్లా,మండల స్థాయిల్లో 24గంటలూ పనిచేసే విధంగా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు.  

Tags:    

Similar News