ఏపీలో మొదటి రోజు వ్యాక్సిన్ ఎంతమందికి ఇచ్చారో తెలుసా?
* నిన్న రాత్రి వరకు 60.52 శాతం వ్యాక్సినేషన్ పూర్తి * పలు కారణాలతో 39.48 శాతం మంది టీకాకు దూరం * నేడు మిగితా వారికి టీకా వేసేందుకు ఏర్పాట్లు సిద్ధం
ఏపీలో వ్యాక్సినేషన్ సజావుగా కొనసాగుతోంది. తొలిరోజు 19,108 మంది ఆరోగ్య సిబ్బంది టీకా తీసుకున్నారు. నేడు మరింత మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఎంపిక చేసిన 332 ఆసుపత్రుల్లో 31,570 మందికి టీకా వేసేలా ఏర్పాట్లు చేపట్టారు. అయితే.. నిన్న రాత్రి 8.30 గంటల వరకు 60.52% మంది టీకా తీసుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే సర్వర్ సమస్య, కొందరిలో అనాసక్తి, సంక్రాంతి పండుగకు ఊళ్లకు వెళ్లడం వంటి కారణాలతో మొత్తంగా 39.48% మంది టీకా తీసుకోలేదు. వీరికి ఇవాళ ఏపీలో వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు.