Corona Tension in TTD: తిరుపతిలో కరోనా కల్లోలం.. 743 మందికి కరోనా పాజిటివ్
Corona Tension in TTD: తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఇప్పటివరకూ 743 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు
Corona Tension in TTD: తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఇప్పటివరకూ 743 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమం తరువాత జరిగిన మీడియా సమావేశంలో టీటీడీ ఈవో అనేక సంచలన విషయలు బయట పెట్టారు. టీటీడీ ఉద్యోగుల్లో 743 మంది కరోనా బారిన పడ్డారు, అందులో 400 మంది కరోనాను జయించగా, మిగిలిన వారు చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. అలాగే 5గురు కరోనాతో మృతి చెందారని తెలిపారు.
టీటీడీ వార్షిక బడ్జెట్ 3200 కోట్లు
గత నెల హుండీ ఆదాయం 16 కోట్లు, ఈ -హుండీ ద్వారా 3 కోట్లు ఆదాయం వచ్చిందని అన్నారు. టీటీడీ వార్షిక బడ్జెట్ 3200 కోట్లు అని ఆయన పేర్కొన్నారు. ఇందులో 1350 కోట్ల రూపాయలు జీతాలకు అవుతుంది. ఖర్చులు ఎంత తగ్గించుకున్నా ఇప్పుడు నెలకు 150 నుంచి 200 కోట్ల రూపాయలు అవుతోందని తెలిపారు. ఇప్పటి వరకు కార్పస్ ఫండ్ నుంచి నిధులు తీసుకోలేదన్న ఆయన భవిష్యత్తులో టీటీడీ బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఆగస్టు నెలాఖరులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ లాక్ నిబందనలను బట్టి శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలా? భక్తుల మధ్య నిర్వహించాలా? అనే అంశం మీద టీటీడీ పాలకమండలిలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి కల్యాణోత్సవాలను ఆపాలని అర్చకులు మాతో చర్చించ లేదన్న ఆయన అర్చకులు ఏ సలహా ఇచ్చినా మేము సీరియస్ గానే స్పందిస్తామని అన్నారు. .