Corona Fear: గర్భిణీలను భయపెడుతున్న కరోనా సెకండ్ వేవ్

Corona Fear: రోజుకు 30మంది గర్భిణీలకు పైగా పాజిటివ్ * కొవిడ్ ఉన్న గర్భిణీలను పట్టించుకోని ప్రైవేట్‌ ఆస్పత్రులు

Update: 2021-05-07 05:57 GMT

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Corona Fear: కరోనా సెకండ్ వేవ్.. గర్భిణీలను గాబరపెడుతోంది. సంతోషంగా సీమంతం చేసుకుంటే చాలు. పాజిటివ్‌ ఖాతాలో పడేస్తోంది. తిరుపతిలో వైరస్‌ సోకిన గర్భిణీలు రోజురోజుకు పెరుగుతున్నారు. ఫస్ట్‌ వేవ్‌లో 9వందల కేసులు నమోదైతే.. ఇప్పుడు రోజుకు 30 నుంచి 50 మంది గర్భిణీలు కరోనాతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. గడిచిన నెల వ్యవధిలోనే 180 మంది గర్భిణీలు వైరస్‌ బారిన పడ్డారు. వీరికి ప్రత్యేక వైద్యులు కోవిడ్ సేవలు అందిస్తున్నారు.వైరస్‌ ఉన్న గర్భిణీలను ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్‌ చేసుకోవడం లేదు. దీంతో తిరుపతిలో ఉన్న ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రికి గర్భిణీలు భారీగా వచ్చి చేరుతున్నారు. చిత్తూరు జిల్లా నుంచే కాకుండా రాయలసీమలోని ఇతర జిల్లాల నుంచి అలాగే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల వారు సైతం తిరుపతి ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రి బాట పడుతున్నారు.

గర్భిణీలు అర్భాటంగా సీమంతం చేసుకోవడం వల్లే వైరస్‌ బారినపడుతున్నారని వైద్యులు వెల్లడిస్తున్నారు. పైగా గర్భిణీలు ప్రతి నెల చెకప్ కోసం ఆసుపత్రుల చుట్టూ తిరగకూడదని సూచిస్తున్నారు. ఇంట్లో ఉండే జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు కరోనా సోకితే బిడ్డకు ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు. కరోనా గర్భిణీలు మానసిక ధైర్యంతో ఉండాలని సూచిస్తున్నారు.

కరోనా ఉన్న గర్భిణీలకు సిజేరియన్‌ చేసిన డాక్టర్లు వైరస్‌ బారిన పడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఆపరేషన్ చేసిన వైద్యులకు పాజిటివ్ వస్తోంది. అయితే కరోనా చికిత్స తీసుకొని మళ్లీ విధులకు హాజరవుతున్నారు. 

Full View


Tags:    

Similar News