Corona Patient died on Road: రోడ్డుపై కుప్పకూలి ప్రాణాలొదిలిన కరోనా పేషేంట్
Corona Patient died on Road: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అమానుష ఘటన చోటుచేసుకుంది.
Corona Patient died on Road: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని క్వారంటైన్ కు తరలిస్తామని చెప్పి తీసుకెళ్లకుండా ఆపేశారు అధికారులు. అయితే అంబులెన్స్ ఆలస్యం కావడంతో కరోనా రోగి రోప్డుపైనే కుప్పకూలి ఆ వ్యక్తి మృతి చెందాడు. కరోనా భయంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లలేదు బంధువులు. దీంతో రెండు గంటలకు పైగా రోడ్డుపైనే పడివుంది మృతదేహం.కరోనా అనుమానంతో చుట్టుపక్కలవారు ఇంట్లోనుంచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఆ వ్యక్తికి ఇటీవలే కరోనా పరీక్షలు చేశారు. ఇవాళ మధ్యాహ్నం పాజిటివ్ గా వచ్చినట్టు వాలంటీర్ సమాచారం ఇచ్చారు. ఎక్కడికి వెళ్లోద్దని అంబులెన్స్ వచ్చి క్వారంటైన్ వార్డుకు తీసుకువెళుతుందని వాలంటీర్ సమాచారం ఇచ్చాడు.
అయితే అప్పటికి తీవ్ర అస్వస్థతకు గురైన ఆ వ్యక్తి రోడ్డుమీదే కుప్పకూలాడు. చనిపోయాడని తెలుసుకున్న వాలంటీర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈలోపు ఎవ్వరు కూడా రోడ్డుపై ఉన్న మృతదేహాన్ని చూడటానికి కూడా రాలేదు. వాలంటీర్ కూడా కరోనా వైరస్ భయంతో దగ్గరికి రాలేదు. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. బంధువులెవ్వరు రాకపోవడంతో సిబ్బంది కూడా ఆ వైపు రాలేదు. చివరకు మున్సిపల్ సిబ్బంది వచ్చి మృతదేహాన్ని తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడిక్కడ స్వీయ లాక్ డౌన్ పాటిస్తున్నారు. ఊరిలో కూడా వ్యాపారులు స్వచ్చందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు.