Corona kits scam in Kakinada: కాకినాడలో కరోనా టెస్టింగ్ కిట్ల మాయాజాలం

Corona kits scam in Kakinada: కాకినాడలో ఉచితంగా ప్రజలకు పరీక్షలు నిర్వహించాల్సిన కిట్లు ప్రయివేటు ఆసుపత్రులకు తరలి పోతున్నాయి.

Update: 2020-08-11 03:35 GMT

ఒక పక్క ప్రజలు కరోనా ఇక్కట్లలో ఉన్నారు. కరోనా సోకిందో లేదో తెలుసుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. ప్రభుత్వం ఉచితంగా సహాయం చేద్దామని ప్రయతింస్తుంటే వైద్య శాఖలో ఇంటి దొంగలు ఆ ఇంతా కరోనా కిట్లను కూడా తినేస్తున్నారు. 

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కిట్లు పక్కదారి పడుతున్నాయి. సాధారణ ప్రజలకోసం ఉచితంగా టెస్టులు చేయాడం కోసం ప్రభుత్వం అందచేస్తున్న కరోనా కిట్లను ప్రయివేట్ ఆసుపత్రులకు అమ్ముకుంటున్నట్టు తెలుస్తోంది. వివరాలు ఇవీ..

- ఉచితంగా పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇస్తోన్న ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను ప్రైవేట్ ఆస్పత్రులకు అమ్ముతున్నట్టు ఆరోపణలు..

- కాకినాడ కార్పోరేషన్ పరధిలో కిట్లు పక్కదారి పట్టినట్టు గుర్తించిన అధికారులు..

- నగరపాలక సంస్థ మెడికల్ ఆఫీసర్ కరీముల్లా ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి..

- హెల్త్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ ను మాతృసంస్థకు బదిలీ..

- కిట్ల మాయాజాలంపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి..

- ఫోర్జరీ సంతకాలతో మరో 300 కిట్లు తీసుకునట్టు విచారణలో గుర్తింపు..

- కాకినాడ జీజీహెచ్ లో ఎంఎన్ఓగా పని చేసి బాషా ఫోర్జరీ చేసినట్టు నిర్ధారణ..

- ప్రస్తుతం అమలాపురం ఏరియా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తోన్న బాషా..

- జీజీహెచ్ ఆర్ఎంఓ సంతకం ఫోర్జరీ చేసి 300 కిట్లు తీసుకుని.వెళ్లినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసిన డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరీ..

- రంగంలోకి దిగిన కాకినాడ త్రీ టౌన్ పోలీసులు.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన బాషా..

- ఇప్పటి వరకు వచ్చిన కిట్లు నిర్వహించిన పరీక్షలపై విచారణ చేపట్టిన పోలీసులు..

- కిట్లు జారీ చేసే విభాగంలో సిబ్బందిని ఇతర విభాగాలకు బదిలీ చేసిన డిఎం అండ్ హెచ్ఓ సుపరహ్మణ్యేశ్వరీ..

- ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ మల్లిక్ పాత్ర పైనా అనుమానాలు.

Tags:    

Similar News