ఏపీలో విస్తరిస్తున్న కరోనా..100కు పైగా నమోదైన కేసులు

Corona: JN-1 పేరుతో వ్యాపిస్తున్న వేరియంట్

Update: 2024-01-02 04:46 GMT

ఏపీలో విస్తరిస్తున్న కరోనా..100కు పైగా నమోదైన కేసులు 

Corona: ఏపీలో కరోనా కొత్త వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే 100కు పైగా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. అయితే.. JN-1 పేరుతో వ్యాపిస్తున్న వేరియంట్‌పై అంతగా.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. అయినా.. వేరియంట్ పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ఇప్పటికే టెస్ట్ కిట్లను అందుబాటులో ఉంచుతోంది. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ప్రత్యేకంగా వార్డులను కేటాయిస్తూ.. ఎప్పటికప్పుడు మెడిసిన్లు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు పాటిస్తోంది.

వేగంగా విస్తరిస్తోన్న ఈ కొత్త వేరియంట్ పట్ల జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా మాస్క్ తప్పనిసరిగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలం కాబట్టి.. రెగ్యులర్‌గా ఫీవర్ సర్వే చేయాలని వైద్యాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా.. గ్రామస్థాయిలోను ర్యాపిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా 40 వేల ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు ఆక్సిజన్, బెడ్స్, మందులు, పనితీరుపై సమీక్ష నిర్వహించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోనున్నారు.

Tags:    

Similar News