విశాఖలో పెరుగుతున్న కొత్త వేరియంట్.. 18కి చేరిన పాజిటివ్ కేసులు

Andhra Pradesh: కేసులు పెరుగుతుండడంతో సర్కార్ అలర్ట్

Update: 2023-12-26 08:23 GMT

విశాఖలో పెరుగుతున్న కొత్త వేరియంట్.. 18కి చేరిన పాజిటివ్ కేసులు

Andhra Pradesh: యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌ మళ్లీ ప్రభావం చూపిస్తోంది. క్రమంగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఏపీలోనూ కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు కలవరానికి గురి చేస్తోన్నాయి. అయితే కరోనా కేసుల పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వ అప్రమత్తమైంది. టెస్టులు చేయడానికి టెస్ట్ కిట్లను అందుబాటులో ఉంచుతోంది.

కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు ప్రజలను కలవరానికి గురిచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జేఎన్-1 ప్రభావం ప్రస్తుతానికి లేకపోయినా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో కోవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. విశాఖ ప్రజలను కోవిడ్ కలవరానికి గురిచేస్తోంది. ఇక్కడ ఏకంగా కొవిడ్ కేసుల సంఖ్య 18కి చేరుకుంది. విశాఖలోని కేజీహెచ్‌లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. అటు విశాఖ ఎయిర్‌పోర్టులోనూ ఆర్టీపీసీఆర్ టెస్టులను పెంచారు. మరోవైపు కొత్త వేరియంట్‌తో ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని వైద్యులు చెబుతున్నారు.

రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా వార్డులను సిద్ధం చేస్తోంది. ఎప్పటికప్పుడు మెడిసిన్స్ అందుబాటులో ఉండేలా రంగం సిద్ధం చేస్తోంది. ఎక్కడికి వెళ్లినా.. మాస్క్ తప్పనిసరిగా ఉపయోగించాలంటూ సూచిస్తోంది. అటు కొవిడ్ వ్యాప్తిపై సీఎం జగన్ ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్త వేరియంట్‌పై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. 

Tags:    

Similar News