Guntur: నత్తనడకన గుంటూరు శిల్పారామం నిర్మాణం.. 2017 లో నిర్మాణానికి శంకుస్థాపన
Guntur: త్వరగా పనులు పూర్తి చేయాలని స్థానికుల డిమాండ్
Guntur: కళలకు కొలువు శిల్పారామం. ఈ పేరు వినగానే గుర్తొచ్చేది హైదరాబాదే. కానీ ఇప్పుడు గుంటూరు కూడా ఆ పేరు సొంతం చేసుకోవాలనుకుంది. వినడానికి చూడటానికి బాగానే ఉన్నా.... సాధ్యమయ్యేదేనా..? ఇంతకీ గుంటూరులో శిల్పారామం ఏంటీ అనుకుంటున్నారా..? గుంటూరులో శిల్పారామం ఉంది. కానీ మధ్యలోనే ఆగిపోయి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది.
హైదరాబాద్లో శిల్పారామం హ్యాండీ క్రాఫ్ట్ కు కేరాఫ్ అడ్రస్. పూర్తి గ్రామీణ వాతావరణంతో పల్లె టూరు అందాలన్నీ కేంద్రీకృతమై ఉండే టూరిజం స్పాట్ శిల్పారామం. అందుకే భాగ్యనగరంలో ఎన్నో సంప్రదాయ పండుగలకు శిల్పారామం వేదికవుతోంది. అంతటి అద్భుతాన్ని గుంటూరులో కూడా ఏర్పాటు చేశారు. కానీ . అదిలోనే హంసపాదు అన్న చందంగా మారింది. చాలా వరకూ పనులు పూర్తయినా ఇంకా చిన్నచిన్న పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే అవి అరకొరగా జరుగుతున్నాయి.
2017లో కేంద్ర ప్రభుత్వం గుంటూరులో శిల్పారామం నిర్మించాలని నిర్ణయించింది. చేనేత హస్త కళల విభాగం తీర్మానం చేసి నాలుగు కోట్ల బడ్జెట్ తో శిల్పకళావేదిక నిర్మాణానికి పూనుకున్నారు. సరిగ్గా శిల్పారామం మొదలుపెట్టి ఆరు సంవత్సరాలు కావస్తోంది. ఐనా అభివృద్ధి పనులు నత్త నడకన సాగుతున్నాయి. ఇంతవరకూ ప్రారంభానికి నోచుకోలేదు. వైసీపీ ప్రభుత్వం కావాలనే శిల్పారామాన్ని పూర్తి చేయడంలేదని స్థానికులంటున్నారు.
శిల్పారామం ప్రారంభమైతే, గుంటూరు టూరిజం స్పాట్ లలో ఒకటిగా ఉండేది. ప్రజలు కూడా వీకెండ్ సమయాల్లో ఇటువంటి వాటినే సందర్శిస్తుంటారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభమైనా... వైసీపీ సర్కారు దానిని పూర్తి చేయడంలో విఫలమైందని స్థానికులంటున్నారు. గుంటూరు శిల్పారామాన్ని పూర్తి చేసే విషయంలో చొరవ తీసుకోవాల్సిన వాలని స్థానికులు కోరుతున్నారు.