Coronavirus Outbreak: కేసులు పెరుగుతుండటంతో కర్య్పూ.. ఏపీలో పలు జిల్లాల్లో వర్తింపు
Coronavirus Outbreak: ఏపీలో కరోనా వ్యాప్తి లెక్కలు చూస్తే గుండెలు గుభేల్ అంటున్నాయి. మొదటి వెయ్యి, తరువాత రెండు వేలు, తరువాత నాలుగు వేలు.
Coronavirus Outbreak: ఏపీలో కరోనా వ్యాప్తి లెక్కలు చూస్తే గుండెలు గుభేల్ అంటున్నాయి. మొదటి వెయ్యి, తరువాత రెండు వేలు, తరువాత నాలుగు వేలు. ప్రస్తుతం ఏకంగా 8 వేల వరకు రోజుకు కేసులు నమోదవుతుండటంతో జనాలు హడలి పోతున్నారు. వీరితో పాటు అధికారులు సైతం దీనిని కట్టడి చేసేందుకు వీలైనంత మేర చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యల్లో భాగంగా ఏపీలో పలుజిల్లాల్లో కర్య్పూ విధిస్తున్నట్టు ముందుగా ప్రచారం చేసి, అందుకు తగినట్టుగా చర్యలు తీసుకున్నారు.
ఏపీలో గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకీ కొత్త కేసుల సంఖ్య కూడా పెరిగిపోతూనే ఉంది. అటు ఏపీ ప్రభుత్వం కూడా కరోనా కట్టడికి ఎన్నో రకాలజాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక పలు జిల్లాలోని ప్రజలు స్వయంగా లాక్ డౌన్ కూడా విధించుకుంటున్నారు. ఇక ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. ఇక మరోవైపు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 80 వేలు దాటింది. అందులోనూ ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో కోవిడ్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి.దీంతో ఈస్ట్ గోదావరి జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆదివారం రోజున వివిధ రకాల మార్కెట్‌లకు తాకిడి ఎక్కువగా ఉంటూండటంతో.. సన్ డే ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం6 గంటల వరకూ పూర్తిస్థాయి కర్ఫ్యూ విధించారు. కాగా గత ఆదివారం కూడా ఇలానే కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ఈ కర్ఫ్యూతో జిల్లా మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలే స్వయంగా లాక్‌డౌన్ విధించుకుంటున్నారు.
ఇక ఆంధ్ర ప్రదేశ్‌లో అత్యధిక కరోనా కేసులతో తూర్పు గోదావరి జిల్లా టాప్‌లో ఉంది. ఈస్ట్ గోదావరిలో కరోనా కేసుల సంఖ్య ఏకంగా 12 వేలు దాటింది. ప్రస్తుతం అక్కడ 12,391 కరోనా కేసులు ఉండగా,ఇప్పటివరకూ 113 మంది కోవిడ్ బారిన పడి మరణించారు. ఇక తూర్పు గోదావరిలో 8595 యాక్టీవ్ కేసులు ఉండగా, 3683 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.