Anantapur: ఓటర్ రీ వెరిఫికేషన్ పై కలెక్టర్ క్షేత్ర స్థాయి పర్యటన
Anantapur: డబుల్ ఎంట్రీ ఉన్నఇళ్లకు వెళ్లి స్వయంగా విచారించిన కలెక్టర్
Anantapur: అనంతపురం జిల్లాలో కలెక్టర్ గౌతమి పర్యటించారు. ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించిన ఆమె ఓటర్ రీ వెరిఫికేషన్ పై చిన్నముష్టురు, మాళాపురం, విడపనకల్లు గ్రామాలలో డబుల్ ఎంట్రీ ఉన్న ఇళ్లకు వెళ్లి స్వయంగా విచారించారు.అనంతపురం జిల్లాలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రీ వేరిఫికేషన్ ప్రక్రియ పకడ్బందీగా కొనసాగుతోంది. గతంలో ఓటర్ల తొలగింపుపై ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. కాగా ఇప్పటికే ఇద్దరు zp ceoల సస్పెన్షన్ నేపథ్యంలో కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పర్యటించారు.