5న జగనన్న విద్యా కానుక

ఏపీలో అక్టోబర్‌ 5వ తేదీన జగనన్న విద్యా కానుక ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా పిల్లలకు కిట్‌లు..

Update: 2020-09-30 02:01 GMT

ఏపీలో అక్టోబర్‌ 5వ తేదీన జగనన్న విద్యా కానుక ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా పిల్లలకు కిట్‌లు అందజేస్తామని తెలిపారు. అలాగే నవంబర్‌ 2వ తేదీన స్కూళ్లు తెరవాలని నిర్ణయించామన్నారు, అందువల్ల ఇప్పుడే పిల్లలకు కిట్‌ ఇస్తే స్కూళ్లు తెరిచేలోగా యూనిఫామ్‌ కుట్టించుకుంటారని అన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా పలు అంశాలపై వారికి మార్గనిర్దేశం చేశారు. స్కూళ్లలో నాడు–నేడు మొదటి దశలో ఇంకా పనులు మొదలు కాని స్కూళ్లలో వెంటనే పనులు మొదలు పెట్టాలి. 701 టాయిలెట్లకు వెంటనే శ్లాబ్‌ పనులు పూర్తి చేయాలని. జిల్లా జాయింట్ కలెక్టర్లు రోజూ పర్యవేక్షించాలని సీఎం అన్నారు. గతంలో అక్టోబరు 5న స్కూళ్లు తెరవాలని నిర్ణయించినప్పటికీ, రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి తగ్గుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.. ఈ క్రమంలో స్కూళ్ళు తెరిస్తే కేసులు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని అందువల్ల నవంబరు 2వ తేదీకి వాయిదా వేశారు.  

Tags:    

Similar News