CM Jagan Review: ఎంఎస్‌ఎంఈలపై ప్రత్యేక దృష్టిపెట్టండి..
CM Jagan Review: కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్ నిర్మాణ పనులపై ప్రస్తావన
CM Jagan Review: ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడిన సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమలు, వాటి పనితీరు, ఉత్పత్తి పెంచడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను కోరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో కొత్తగానిర్మిస్తున్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై సమీక్షించారు.మొదటి దశలో అన్ని ఫిషింగ్ హార్బర్లు డిసెంబర్‌కల్లా పూర్తవుతాయని అధికారులు సీఎం జగన్ కు వివరించారు.
తొలిదశలో నిర్మిస్తున్న ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలపై సమీక్షించారు.. జువ్వలదిన్నెలో 86 శాతం పనులు పూర్తి, నిజాంపట్నంలో 62 శాతం, మచిలీపట్నంలో 56.22 శాతం, ఉప్పాడలో 55.46శాతం పనులు పూర్తయ్యాయని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ మరో 40 రోజుల్లో సిద్ధం అవుతుందని అధికారులు తెలిపారు.
ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తులకు మార్కెటింగ్‌పై దృష్టిపెట్టాలసి సీఎం జగన్ అధికారుకు సూచించారు. ఇతరదేశాల్లో ఎంఎస్‌ఎంఈల నిర్వహణ, నాణ్యమైన ఉత్పాదనల విధానాలను ఇక్కడకూడా అమల్లోకి తీసుకురావాలన్నారు. వినూత్న ఉత్పాదనలు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీపై దృష్టిపెట్టాలని సూచించారు. హ్యాండ్‌లూమ్స్, గ్రానైట్ రంగాల్లో ఎంఎంస్‌ఎంఈలను క్లస్టర్లుగా విభజించే విషయాన్ని పరిశీలించాలన్నారు.