cm ys jagan mohan reddy review meeting : ప్రతి ఆస్పత్రిలో బ్లాక్‌ బోర్టులో బెడ్ల వివరాలు : సీఎం జగన్‌

Update: 2020-07-31 09:18 GMT

కోవిడ్‌ నివారణా చర్యల్లో భాగంగా క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రతిజిల్లాలో కోవిడ్‌ చికిత్స కోసం గుర్తించిన ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీలు, భర్తీల వివరాలు ఆస్పత్రి హెల్ప్‌ డెస్క్‌లో అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు సంబంధిత ఆస్పత్రిలో బ్లాక్‌ బోర్డు పెట్టి... బెడ్లు భర్తీ, ఖాళీల వివరాలను అందులో రాయాలని సూచించారు. ఎవరికైనా బెడ్‌ అందుబాటులోకి లేదంటే సమీపంలోని ఆస్పత్రిలో బెడ్‌ అలాట్‌ అక్కడనుంచే జరిగేలా ఏర్పాటు ఉండాలని ఆదేశించారు. ఇకపై బెడ్లు దొరకలేదనే పరిస్థితి ఉండకూడదని.. హెల్ప్‌ డెస్క్‌ల్లో ఆరోగ్య మిత్రలను ఉంచాలని అన్నారు.

కోవిడ్ ‌కోసం నిర్దేశించిన 138 ఆస్పత్రుల యాజమాన్యంపై దృష్టిపెట్టాలని.. సూక్ష్మస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు. ఇక ఈ హెల్ప్‌ డెస్క్‌లో ఉన్నవారికి ఓరియంటేషన్‌ బాగుండాలని..హెల్ప్‌ డెస్క్‌ ప్రభావవంతంగా పనిచేస్తే... చాలావరకు సమస్యలు తగ్గుతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్ కేర్ సెంటర్లలో బెడ్లు, వైద్యం, ఫుడ్, శానిటేషన్‌ బాగుందా లేదా అన్నదానిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు.అలాగే జీజీహెచ్‌ లాంటి ఆస్పత్రులపై జేసీలు మరింత శ్రద్ధపెట్టాలని అన్నారు. కోవిడ్‌పై అవగాహన కల్పించడానికి విస్తృతంగా ప్రచారం చేపట్టాలని..

స్వప్రయోజనాలకోసం తప్పుడు వార్తా కథనాలు రాస్తే ఎప్పటికప్పుడు ఖండించాలని.. లేదంటే ప్రజలు వీటిని నిజం అనుకునే అవకాశాలు ఉంటాయని.. కోవిడ్ కు సంబంధించి ఎట్టిపరిస్థితులలో కూడా నిజాలు మాత్రమే ప్రజలముందు పెట్టాలని కోరారు. ఇక అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలని.. ప్లాస్మా థెరఫీపై బాగా అవగాహన కల్పించాలి.. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటే ప్రోత్సహించాలని జేసీలకు సూచించారు. అలాగే ప్లాస్మా దానం చేసేవారికి రూ.5వేల రూపాయలు ఇస్తామని.. మంచి భోజనం, వారి ఆరోగ్యం కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుందని జగన్ అన్నారు. మరోవైపు దేవుడి దయవల్ల కోవిడ్ తగ్గుముఖం పడితే సెప్టెంబరు 5 నుంచి స్కూళ్లు తెరిచే ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.

Tags:    

Similar News