CM Jagan Launches Police Seva App : ఏపీలో పోలీస్ సేవ యాప్..ప్రారంభించిన సీఎం జగన్
CM Jagan Launches Police Seva App : ఇప్పటి వరకు దేశంలోని ఏరాష్ట్రంలో లేని విధంగా ఏపీ పోలీస్ శాఖ మొట్టమొదటి సారి ఓ కొత్త ఆలోచన చేసింది. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లే అవసరం లేకుండా ప్రజలకు 87 రకాల సేవలను పొందేలా ప్రత్యేకంగా 'ఏపీ పోలీస్ సేవ'యాప్‌ను సిద్ధం చేసింది. ఈ యాప్ ను రాష్ట్రంలోని 964 పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తుంది. పోలీస్ శాఖ సిద్దం చేసిన ఈ యాప్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభించారు. తాడేపల్లిలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్‌త్ పాటు డీజీపీ గౌతవ్ సవాంగ్ పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ యాప్ ద్వారా పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని ఈ సందర్భంగా పోలీసులు సీఎంకు తెలిపారు. అనంతరం యాప్ ఏ విధంగా పనిచేస్తుంది అనే విధానాన్ని సీఎంకు వివరించారు.
అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ యాప్ ద్వారా పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. యాప్ అందుబాటులోకి రావడం ద్వారా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవస్థలు తప్పుతాయన్నారు. మొబైల్ నుంచి ఫిర్యాదు చేసే అవకాశం, స్టేటస్ చూసుకునే వీలు ఉంటుందని తెలిపారు. యాప్ ద్వారా 87 రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. అన్ని రకాల నేరాలపై ఈ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయొచ్చన్నారు. అంతే కాదు యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే పోలీసులు రశీదు కూడా యాప్ ద్వారానే ఇస్తారన్నారు. సైబర్ భద్రత, మహిళా భద్రత, అనుమతులు, ఎన్‌వోసీలు, లైసెన్సులు, పాస్‌పోర్ట్ సేవలు, కేసు దర్యాప్తు పురోగతి, అరెస్టులు, ఎఫ్‌ఐఆర్‌లు, రికవరీలు, రోడ్డు భద్రత, ఇతర వెరిఫికేషన్లు ఇలా అన్ని పోలీసు సేవలను యాప్ ద్వారా పొందవచ్చు. పోలీసు స్టేషన్ ద్వారా లభించే అన్ని సేవలను ఈ మొబైల్ యాప్ ద్వారా పొందవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సమాచారాన్ని నిర్థారించుకునే అవకాశం కూడా ఈ యాప్ ద్వారా ఉందన్నారు. అత్యవసర సమయాల్లో వీడియో కాల్ చేస్తే పోలీస్ కంట్రోల్ రూంకు వెంటనే సమాచారం వెళ్తుందన్నారు.
ఆరు విభాగాల్లో 87 రకాల సేవలు..
అరెస్టుల వివరాలు
వాహనాల వివరాలు
లాక్‌మానిటరింగ్ సర్వీసు (ఎల్‌ఎంఎస్) , ఈ–బీట్
ఎన్‌వోసీ, వెరిఫికేషన్లు
లైసెన్సులు, అనుమతులు
పాస్‌పోర్ట్ వెరిఫికేషన్
బ్లడ్ బ్యాంకులు, డయాలసిస్ కేంద్రాలు, ఆసుపత్రులు, మందుల దుకాణాల వివరాలు
పోలీస్ డిక్షనరీ
సమీపంలోని పోలీస్‌స్టేషన్
టోల్‌ఫ్రీ నంబర్లు
వెబ్‌సైట్ల వివరాలు
న్యాయ సమాచారం
బ్లాక్ స్పాట్లు
ఈ–చలానా స్టేటస్
నేరాలు, వేధింపులపై ఫిర్యాదులు
నేరాలపై ఫిర్యాదులు
సేవలకు సంబంధించిన దరఖాస్తులు
యాక్సిడెంట్ మ్యాపింగ్
రహదారి భద్రత గుర్తులు
ఎఫ్‌ఐఆర్ స్థితిగతులు, డౌన్‌లోడ్
దొంగతనం ఫిర్యాదులు/ రికవరీలు
మిస్సింగ్ కేసులు /దొరికిన వారు/గుర్తు తెలియని మృతదేహాలు
ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లు
సైబర్ భద్రత, మహిళా భద్రత
సోషల్ మీడియా
కమ్యూనిటీ పోలీసింగ్
స్పందన వెబ్‌సైట్
ఫ్యాక్ట్ చెక్