YSR Cheyutha Scheme: అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగుల కోసం 'వైఎస్సార్ చేయూత'
YSR Cheyutha Scheme: మహిళల్లో ఆర్థిక సుస్థిరత, సాధికారతను పెంపొందించే ఉద్దేశ్యంతో జగన్ సర్కార్ మరోపథకానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంతో వైఎప్సార్ చేయూత అనే పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.
YSR Cheyutha Scheme: మహిళల్లో ఆర్థిక సుస్థిరత, సాధికారతను పెంపొందించే ఉద్దేశ్యంతో జగన్ సర్కార్ మరోపథకానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంతో వైఎప్సార్ చేయూత అనే పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ పథకం లో భాగంగా మొదటి విడత సాయంగా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.18,750లు జమచేశారు. ఈ పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో అర్హత ఉన్న మహిళలకు లబ్ధి పొందనున్నారు. వీరి ఖాతాలోకి ఏటా నేరుగా రూ.18,750 చొప్పున నాలుగేళ్ల కాలంలో రూ. 75,000 లను మహిళలకు ఉచితంగా ప్రభుత్వం జమ చేయనున్నది.
మహిళా సాధికారతే లక్ష్యంగా అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపడానికి వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించమని సీఎం జగన్ అన్నారు. ఈ పథకాన్ని ప్రారంభించడం తన అదృష్టమని.. 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు ఏ పథకం లేదని.. వైఎస్ఆర్ చేయూత ద్వారా వారి కుటుంబాలకు మంచి జరగాలని ఆకాంక్షించారు. మహిళలకు తోడుగా ఉంటాం.. నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో రూ.18,750 జమ చేస్తున్నాం.. నాలుగేళ్లలో రూ.75వేల ఆర్థిక సహాయం అందుతుంది అన్నారు.
ఈ పథకం ద్వారా దాదాపు 25 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరుంది. మహిళల్లో ఆర్థిక సుస్థిరత, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి తోడ్పాటును అందించేలా ఈ పథకాన్ని రూపొందించారు. రాష్ట్ర బడ్జెట్‌లో వైఎస్సార్ చేయూత పథకానికి రూ.4,700కోట్లు కేటాయించారు. గతంలో ఏ ప్రభుత్వం అందించని విధంగా దాదాపు 25లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా 4 ఏళ్లలో రూ.17 వేల కోట్లు లబ్ధిపొందనున్నారు.