రేపట్నుంచి కడప జిల్లాలో సీఎం టూర్
* మూడ్రోజుల పాటు కొనసాగున్న జగన్ పర్యటన.. కడప, కమలాపురం, పులివెండుల నియోజకవర్గాల్లో టూర్
AP CM Jagan: సీఎం జగన్ రేపట్నుంచి మూడ్రోజుల పాటు సొంత జిల్లాలో పర్యటించనున్నారు. కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో పర్యటించి పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టన్నారు. 23న కడప జిల్లా పెద్ద ధర్గాలో ప్రార్థనలు చేస్తారు. అనంతరం రాష్ట్ర పరిశ్రమల సలహాదారు రాజోలి వీరారెడ్డితోపాటు, ఆర్టీసీ ఛైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డి, ycp రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ ఖాన్ ఇళ్లలో జరిగే వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు.
ఆ తర్వాత కమలాపురంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. రాత్రికి ఇడుపులపాయ గెస్ట్ హౌజ్ లో బస చేస్తారు. ఇక 24న వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి, చర్చిని సందర్శిస్తారు. ఆతర్వాత పులివెందు రింగ్ రోడ్డు సర్కిల్, కూరగాయ మార్కెట్ తోపాటు బస్టాండ్ ను ప్రారంభిస్తారు. ఇక 25న క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో పులివెందుల సీఎస్ఐ చర్చ్ లో ప్రార్థనలు చేస్తారు. ఆతర్వాత తాడేపల్లికి తిరుగుపయనం అవుతారు.