CM Jagan: పలు శాఖల అధికారులతో సీఎం జగన్ సమీక్ష

CM Jagan: ఆదాయాలు నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలి

Update: 2022-07-25 16:00 GMT

CM Jagan: పలు శాఖల అధికారులతో సీఎం జగన్ సమీక్ష 

CM Jagan: ఎక్సైజ్, రెవెన్యూ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, భూగర్భ గనులు, అటవీ పర్యావరణశాఖ అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీఎంకు అధికారులు వివరాలు అందించారు. పన్నుల వసూళ్లలో పారదర్శకత, పన్నుల విభాగంలో నాణ్యమైన సేవలకు ఉద్దేశించిన పలు నిర్ణయాల అమలుపై సీఎం సమీక్షించారు. పన్నుల విభాగంలో డేటా అనలిటిక్స్‌ సెంటర్‌ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు.

మరింత పారదర్శకత, జవాబుదారీతనంతో ఆదాయాలు నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదులు, అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించి రాబడులు ఎప్పటికప్పుడు వచ్చేలా చర్యలు ఉండాలని సూచించారు. తప్పుడు బిల్లులు లేకుండా, పన్ను ఎగవేతలకు ఆస్కారం లేకుండా మంచి విధానాలను రూపొందించుకోవాలని ఆదేశించారు.

అక్రమ మద్యం తయారీ, రవాణాలను నిరోధించాలన్నారు సీఎం జగన్. బెల్టుషాపులు, గ్రామాల్లో అక్రమ మద్యం నిరోధంలో మహిళా పోలీసులది కీలకపాత్ర కావాలన్నారు. అక్రమ మద్యం తయారీ, అమ్మకాలకు సంబంధించి క్రమం తప్పకుండా వారి నుంచి నివేదికలు తీసుకోవాలని సూచించారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం, ఎమ్మార్వో, ఎండీఓ, ఆర్డీఓ, కలెక్టర్‌ కార్యాలయాలతో పాటు అవినీతి జరగడానికి అవకాశం ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై మరింత ఫోకస్‌ పెట్టాలని ఆదేశించారు. 

Tags:    

Similar News