రాజ్యసభ సభ్యుల ఎంపికపై జగన్ కసరత్తు

Andhra Pradesh: రాజ్యసభకు ఇద్దరు బీసీలు, ఇద్దరు రెడ్డిలు

Update: 2022-05-17 02:03 GMT

రాజ్యసభ సభ్యుల ఎంపికపై జగన్ కసరత్తు

Andhra Pradesh: రాజ్యసభ ఎంపిక పై సీఎం జగన్ సుదీర్ఘ కసరత్తు చేశారు. వైసీపీ దక్కే నాలుగు రాజ్యసభ సీట్లలో ఎవర్ని రాజ్యసభలో కూర్చోబెట్టాలనే దానిపై పార్టీ సీనియర్లతో మంతనాలు జరిపి ఫైనల్ చేశారు. అయితే ఈసారి వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్తున్న ఆ నలుగురు ఎవరు ?

వైసీపీకి దక్కే నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో సుదీర్ఘ కసరత్తు చేశారు. పార్టీ సీనియర్లు సజ్జల, సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, బొత్స తో చర్చించారు. మొదట్లో చాలా పేర్లు తెరపైకి వచ్చిన ఆఖరి నిమిషంలో వైసీపీ బాస్ లెక్కలు మారిపోయాయి. దీంతో ఇద్దరు బీసీలను, ఇద్దరు రెడ్డిలను రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు సీఎం జగన్

ఇప్పటికి వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడుగా ఉన్న వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి పదవి కాలం ముగియడంతో మరోసారి ఆయనను రాజ్యసభకు పంపాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక మిగిలిన మూడు సీట్లపై పార్టీ సీనియర్లతో సుదీర్ఘంగా చర్చించి సీఎం జగన్ న్యాయవాది, నిర్మాత నిరంజన్ రెడ్డి కి అవకాశం ఇచ్చారు. మరో రెండు సీట్లలో బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన బీదమస్తాన్ రావుకి ఒక్క సీటు, బీసీ సంఘాల అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కు ఇంకో సీటు ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. మొత్తానికి రాజ్యసభ పై ఎంతో మంది అసలు పెట్టుకున్నప్పటికి జగన్ సింపుల్ గా రాజ్యసభ కు ఎవర్ని పంపాలి అనేదానిపై నిర్ణయం తీసేసుకున్నారు.

Full View


Tags:    

Similar News