CM Jagan: నేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన

CM Jagan: నరసాపురంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

Update: 2022-11-21 02:57 GMT

CM Jagan: నేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన

CM Jagan: నేడు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంతో పాటు పలు పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని దాదాపుగా పూర్తయ్యాయి. సుమారు 3వేల 800 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేయనున్నారు. అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం కూడా కావడంతో మత్స్యకారులకు సీఎం జగన్ ఆర్థిక సహాయం అందించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా విశ్వవిద్యాలయం, బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌, ఉప్పుటేరు నదిపై మూలపర్రు రెగ్యులేటర్‌‌కు సీఎం జగన్ శంకుస్ధాపన చేస్తారు. నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవనం, ప్రజారోగ్య సాంకేతిక శాఖ నరసాపురం పురపాలక సంఘం మంచినీటి అభివృద్ధి పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అలాగే నరసాపురం బస్‌స్టేషన్‌ పునరుద్ధరణ పనులకు శంకుస్ధాపన, ఖజానా మరియు లెక్కల కార్యాలయం, రుస్తుంబాద విద్యుత్‌ ఉపకేంద్రంతో పాటు జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్ధాపన చేయనున్నారు. అలాగే నరసాపురం అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి స్కీము, వశిష్ఠ వారధి - బుడ్డిగవాని రేవు ఏటి గట్టు పటిష్టం చేయడం, శేషావతారం పంట కాలువ అభివృద్ది పనులు, మొగల్తూరు వియర్‌ పంట కాలువ నిర్మాణ పనులు, కాజ, ఈస్ట్‌ కొక్కిలేరు - ముస్కేపాలెం అవుట్‌ఫాల్‌ నిర్మాణపు పనులకు శంకుస్ధాపన చేస్తారు.

ఇప్పటికే ముఖ్యమంత్రి పర్యటన దాదాపుగా నాలుగు సార్లు ఖరారయ్యి ఆ తర్వాత రద్దయిన పరిస్థితులు గతంలో నెలకొన్నాయి. వాతావరణం అనుకూలించకపోవడం, వివిధ కార్యక్రమాల వల్ల ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పర్యటన వాయిదాలు పడ్డాయి. అయితే ఇవాళ పర్యటన ఖరారు కావడంతో.. సీఎం టూర్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నియోజకవర్గ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు.

Tags:    

Similar News