CM Jagan: నేడు సీఎం జగన్ విశాఖ పర్యటన..

CM Jagan: రూ. వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Update: 2023-08-01 03:48 GMT

CM Jagan: నేడు సీఎం జగన్ విశాఖ పర్యటన.. 

CM Jagan: సీఎం జగన్ రేపు విశాఖలో పర్యటించనున్నారు. నగరంలోని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కైలాసపురం పోర్టు ఆసుపత్రి సమీపంలో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణానికి సీఎం భూమి పూజ చేయనున్నారు. జీవీఎంసీకి చెందిన 50 అభివృద్ది పనులకు శంకుస్ధాపన చేయనున్న సీఎం... అనంతరం సిరిపురంలోని ఏయూ క్యాంపస్‌కు చేరుకోనున్నారు. ఎలిమెంట్‌ ఫార్మా ఇంక్యుబేషన్‌ సెంటర్, బయో మానిటరింగ్‌ హబ్‌తో సహా 5 ప్రాజెక్టులకు సంబంధించిన భవనాలను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి బీచ్‌ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌కు రానున్నారు. అక్కడ ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్ధులతో సీఎం ఇంటరాక్ట్‌ కానున్నారు.

Tags:    

Similar News