Cm Jagan: నేడు అమలాపురంలో సీఎం జగన్ పర్యటన.. సున్నా వడ్డీ పథకం నిధుల విడుదల చేయనున్నారు
Cm Jagan: బాలయోగి స్టేడియం వద్ద సభలో ప్రసంగించనున్న సీఎం జగన్
Cm Jagan: అమలాపురంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు పర్యటించనున్నారు. డ్వాక్రా సంఘాలకు వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ నిధులు విడుదల చేయనున్నారు. 1400 కోట్ల రూపాయల నిధులను మహిళల ఖాతాల్లో బటన్ నొక్కి సీఎం జమ చేయనున్నారు. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు అమలాపురంలోని పోలీస్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు సీఎం చేరుకోనున్నారు. 10 గంటల 40 నిమిషాలకు జీఎంసీ బాలయోగి స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకోన్నారు. సభలో మాట్లాడిన అనంతరం ఒంటి గంటకు అమలాపురం నుంచి హెలికాప్టర్‌లో తాడేపల్లికి తిరిగి పయనమవుతారు జగన్.