CM Jagan: వరదలో మునిగిపోయిన ప్రతి ఇంటికీ రూ.10 వేల సాయం ఇస్తాం
CM Jagan: పంట నష్ట పరిహారాన్ని ఈ నెలాఖరులోగా అందిస్తాం
CM Jagan: ముంపు ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోయి నష్టం తక్కువ జరిగినా.. సాయం అందించాలని, ప్రతి గుడిసెకు 10వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటించారు. లంక గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు ఇబ్బందులు పడిన వరద బాధితులను జగన్ పరామర్శించారు. జిల్లా అధికారులు, కలెక్టర్ ముంపు బాధితులకు పరిహారం అందజేశారని, ప్రజలకు వైద్యం అందించామని, ఎక్కిడికి వెళ్లినా చెపుతున్నారని, పశువులకు సైతం వైద్యం అందించారని చెప్పారు.
పారదర్శకంగా సహాయం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. పంట నష్టం జరిగిన సందర్భంగా అందరికీ సాయం అందించామన్నారు. రెండు రోజుల్లో ముంపు బాధితుల లిస్టులు తయారు చేస్తామని చెప్పారు. ఒక వేళ ఎవరికయినా పంట నష్టం జరిగి ఆ లిస్టులో పేరు లేకుంటే.. ఆర్‌బీకేలో ఫిర్యాదు చేయాలని సీఎం కోరారు. ఈ సీజన్‌లోనే జరిగిన పంట నష్ట పరిహారాన్ని ఈ నెలాఖరులోపే అందజేస్తామని జగన్ వెల్లడించారు.