CM Jagan: నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ టూర్
CM Jagan: నరసన్నపేటలో జగనన్న శాశ్వత భూహక్కు.. భూరక్ష కింద రైతులకు పత్రాలను అందజేయనున్న సీఎం జగన్
CM Jagan: సీఎం జగన్ ఇవాళ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. అక్కడ వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పత్రాల పంపిణీని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి 11 గంటలకు నరసన్నపేటలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానానికి చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
సమగ్ర భూ రీసర్వేలో భాగంగా, 2వేల గ్రామాల రైతులకు జగనన్న భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఏపీ సర్కార్ రెడీ అయ్యింది. రాబోయే 15 రోజులలో ఈ 2వేల గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించనున్నారు. ప్రభుత్వం దశల వారీగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సన్నాహాలను పూర్తి చేసింది. రాష్ట్రంలోని భూముల రీసర్వే పూర్తి, రీసర్వే పూర్తైన గ్రామాల్లో అవసరమైన ప్రక్రియను పూర్తిచేసి ఆయా సచివాలయాల్లో స్ధిరాస్తుల రిజిస్ట్రేషన్లను చేయనున్నారు.