CM Jagan: సీఎం జగన్ రాయలసీమ జిల్లాల పర్యటన తేదీలు ఖరారు
CM Jagan: ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సాగనున్న పర్యటన * 8న వైఎస్సార్ ఘాట్ దగ్గర నివాళులర్పించనున్న సీఎం జగన్
CM Jagan: సీఎం జగన్ రాయలసీమ జిల్లాల పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాయలసీమ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈనెల 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్ దగ్గర నివాళులర్పించనున్నారు సీఎం జగన్. రైతు దినోత్సవం సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కడప, అనంతపురం జిల్లాల్లో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.